తెలంగాణ

రేషన్ డీలర్ ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్: రేషన్‌డీలర్లను సస్పెండ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో మనస్తాపానికి గురైన గజ్వేల్ రేషన్‌డీలర్ వజీర్‌ఖాన్ శుక్రవారం మధ్యాహ్నం అంబేద్కర్ సాక్షిగా ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన రేషన్‌డీలర్లు పట్టణంలోని పోలీస్‌స్టేషన్ రోడ్డులో సమావేశమయ్యారు. అయితే, మండల రేషన్‌డీలర్ల అధ్యక్షుడు కూడా కొనసాగుతున్న వజీర్‌ఖాన్ తాను ఆత్మహత్య చేసుకుంటే రాష్ట్రంలోని రేషన్ డీలర్లకైనా ప్రయోజనం జరుగుతుందని, అప్పుడైనా ప్రభుత్వం స్పందిస్తుందని రాష్ట్ర రేషన్‌డీలర్ల సంఘం కార్యదర్శి నర్సింహారావు, జిల్లా రేషన్‌డీలర్ల సంఘం అధ్యక్షులు మొర్సు పద్మ భాస్కర్‌రెడ్డితో వాగ్వాదానికి దిగాడు. అయితే ప్రాణత్యాగం మంచిదికాదని, కుటుంబాన్ని బజారున వేసుకోవద్దని వారు వారిస్తుండగా, వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకొని పరుగులు పెట్టాడు. దీంతో ఒక్కసారిగా తేరుకున్న రేషన్‌డీలర్లు వజీర్‌ఖాన్‌ను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ సమీపంలోని టీస్టాల్ వద్ద గల డ్రమ్ములలోని నీటిని తెచ్చి అతనిపై పోశారు. అప్పటికే కాళ్లు, చేతులు తదితర శరీర భాగాలు కాలిపోగా, సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన రేషన్‌డీలర్లు ఒక్కసారిగా రోడ్డుపైకి చేరుకొని దర్నా, రాస్తారోకో, ర్యాలీ నిర్వహించడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ నేతలు వంటేరు ప్రతాప్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, గాలెంక నర్సింలు, రామరాజశర్మ, భానుప్రకాశ్‌రావు అక్కడికి చేరుకొని రేషన్‌డీలర్ల ఆందోళనకు మద్దతు పలికారు. ధర్నా, రాస్తారోకో చేపట్టడంతో గజ్వేల్ - ప్రజ్ఞాపూర్ రోడ్డు స్తంభించిపోగా, పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.

చిత్రం..ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వజీర్‌ఖాన్