తెలంగాణ

5న బాసరలో ప్రత్యేక పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, జూన్ 29: నిర్మల్ జిల్లా పరిధిలోని బాసర అమ్మవారి క్షేత్రం అధికారులు, అర్చకుల నిర్లక్ష్యం, ఆలయం దక్షిణ, ఉత్తర రాజగోపురాల కలశాలపై తొడుగులు లేకపోవడాన్ని గమనించిన శ్రీ శృంగేరి జగద్గురు విధుశేఖర భారతీస్వామీజీ దక్షిణ, ఉత్తర రాజగోపురాలపై గల శిలాక్షరాలపై వచ్చేనెల ఐదో తేదీ సప్తమిన ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఆలయ అర్చకులకు సూచించినట్లు ఆలయ ప్రత్యేకాధికారి ఎ.సుధాకర్‌రెడ్డి తెలిపారు. తొడుగు ఊడిపోవడం అంటే ఆలయానికి అరిష్టమని పలువురు పండితులు, భక్తులు పేర్కొంటున్నారు. ఈ విషయమై ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్‌పూజారిని వివరణ కోరగా శ్రీ శృంగేరి పీఠాధిపతులు భారతీస్వామివారి ఆదేశానుసారం వచ్చేనెల 4న దక్షిణ, ఉత్తర రాజ గోపురాలపై తొడుగులు నిర్మించి, 5వ తేదీ సప్తమిన పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తొడుగులు లేకపోవడం వల్ల ఆలయానికి ఎలాంటి అరిష్టం లేదని అన్నారు. శిఖరాలపై తొడుగులను కోతులు తొలగించి ఉండవచ్చని తెలిపారు.

చిత్రం..బాసర ఆలయం ఉత్తర రాజగోపురంపై తొడుగులు లేని దృశ్యం