తెలంగాణ

దండకారణ్యంలో పోలీసు వేట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాటారం, జూన్ 29: దండకారణ్యంలో మళ్ళీ పోలీసుల వేట మొదలైంది. పూర్వ కరీంనగర్ జిల్లాలోని తూర్పు అడవులుగా పేరున్న ప్రాంతం, జిల్లాల పునర్విభజన అనంతరం ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం, మహాదేవపూర్, మహాముత్తారం, మల్హర్, పలిమెల మండలాలల్లోని దండకారణ్య పల్లెల్లోకి పోలీసు బలగాలు మళ్ళీ రంగప్రవేశం చేశాయి. గత కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న వాతావరణంలో మళ్ళీ ఒక్కసారిగా పోలీసు బలగాలు దండకారణ్యంలోకి అడుగిడడంతో ఏమీ జరుగుతుందోననే గిరి పల్లె ప్రజానీకం ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో పాటు ఇటు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల సరిహద్దులుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా భౌగోళిక స్వరూపం ఉంది. దీంతో మంథని డివిజన్‌లోని మల్హర్ మండలంలోని సోమన్‌పల్లి వద్ద గల మానేరు వంతెన నుంచి మొదలుకొని, కాటారం మండలంలోని దామెరకుంట, గుండ్రాతుపల్లి, లక్ష్మీపూర్, మహాదేవపూర్ మండలంలోని అన్నారం, పలుగుల, కుంట్లం, కాళేశ్వరం, అంతర్ రాష్ట్ర వంతెనతో పాటు, కుదురుపల్లి, బీరసాగర్, బెగుళూరు, సూరారం, అంబట్‌పల్లి, మేడిగడ్డ, పంకెన, పలిమెల, సర్వాయిపేట, బూరుగుగూడెం, దమ్మూరు, ఇచ్చంపల్లి, నీలంపెల్లి, ముకునూరు మీదుగా గోదావరి పారివాహక ప్రాంతాల మీదుగా మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఇటు తెలంగాణ జిల్లాలోని జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం జిల్లాల పోలీసు బలగాలు మూకుమ్మడిగా దండకారణ్యంలో కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. గోదావరి నదీ తీరంలోని దట్టమైన దండకారణ్యంగా పేరున్న గిరిజన పల్లెలపై నిత్యం పోలీసుల నిఘా నేత్రం పనిచేస్తోందని.. దాంతో మారుమూల అటవీ పల్లెల్లో సైతం కొత్త వ్యక్తు లు పల్లెల్లోకి అడుగిడినట్లయితే ఎప్పటికప్పుడు పోలీసులకు మొబైల్ ఫోన్‌ల ద్వారా వేగులతో సమాచారం చేరుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం సాగునీటి భారీ ప్రాజెక్టు నిర్మాణాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. మేడిగడ్డ, అన్నారం వద్ద పోలీసు పికెట్లను ఏర్పాటుచేశారు. ఇక్కడ సీఆర్‌పీఎఫ్ జవాన్లతో పోలీసు క్యాంపు నిత్యం పహారా కాస్తున్నది. మరోపక్క పవిత్ర పుణ్యక్షేత్రమైన దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి తరుచుగా వీఐపీలు వస్తున్న నేపథ్యంలో కాళేశ్వరంలో కొత్తగా పోలీసు స్టేషన్‌ను ఏర్పాటుచేశారు. దాంతో పాటు దట్టమైన దండకారణ్యంలోని కొత్త మండలంగా ఏర్పడిన పలిమెలలో సైతం పోలీసు స్టేషన్‌ను ఏర్పాటుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాల వద్ద మరింత పోలీసు బందోబస్తును పెంచారు. మేడిగడ్డ, అన్నారం, కాళేశ్వరం, పలిమెల పోలీసు స్టేషన్లలో సిబ్బందిని పెంచా రు. దీంతో గోదావరి నదీ పారివాహక ప్రాంతంతో పాటు దండకారణ్యంలోని ప్రతి పల్లెపై పోలీసులు డేగ కన్నుతో పర్యవేక్షణ కొనసాగుతోంది. కాటారం సబ్ డివిజన్ పోలీసు అధికారి పర్యవేక్షణలో మల్హర్ మండలంలోని మానేరు వంతెన నుంచి కొయ్యూరు పోలీసు స్టేషన్‌తోపాటు కాటారం, మహాదేవపూర్, కాళేశ్వరం, మహాముత్తారం మండలాల సరిహద్దులలో ఆయా పోలీసు స్టేషన్లతో అనుసంధానంగా పోలీసు వలయాలను ఏర్పాటుచేసుకొని, ఎప్పటికప్పుడు పోలీసు యంత్రాంగం మావోయిస్టుల కదలికలపై నిఘా వేస్తోంది. మహాదేవపూర్ మండలంలోని సరిహద్దులోని దేవాదుల ప్రాజెక్టు నుంచి ముకునూరు, మహాముత్తారం మండలంలోని కనుకునూరు, పెగడపల్లి, బోర్ల గూడెం, పాత రేగులగూడెం, సింగారం ప్రాంతాలతో పాటు లక్ష్మీపూర్, నార్లపూర్, పస్రా, తాడ్వాయి, మేడారం, ఏటూరునాగారం ప్రాంతాలను అటు వరంగల్ ఉమ్మడి జిల్లా పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ దండకారణ్యంలో పోలీసులు అడవులను జల్లెడ పడుతున్నారు. దీంతో దండకారణ్యంలో చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో పోలీసు మార్కు కనిపించే విధంగా నెట్ వర్క్‌ను ఏర్పాటుచేసుకున్నారు.
ఈ నేపథ్యంలో కాటారం సబ్ డివిజన్‌తో పాటు ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రత్యేక పోలీసు బృందాలు దండకారణ్యంలోకి అడుగుపెట్టి, అడవులను జల్లెడ పడుతున్నట్లు సమాచారం. వేసవి కాలంలో నిత్యం కూంబింగ్ నిర్వహించిన పోలీసు బలగాలు, వర్షాకాలం ఆరంభం కావడంతో దండకారణ్యంలోకి ప్రవేశించడం కొంత కష్టతరంగా భావించిన ఉన్నతాధికారులు మళ్ళీ దండకారణ్యంలోకి పోలీసు బలగాలను పెద్ద ఎత్తున దించి కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని తెలంగాణ ప్రాంత పల్లెలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అక్కడి ప్రజలకు గతంలో వాగులు, వంతెనలు ఉప్పొంగడంతో జల దిగ్బంధంలో కూరుకుపోయి, సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించిన రోజులను దృష్టిలో ఉంచుకొని, ప్రస్తుతం వంతెనలు ఇంకా పూర్తి కాకపోవడంతో లోతట్టు పల్లెలతో సమాచార వ్యవస్థ స్తంభించకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తుగా ప్రణాళికలు రచించుకుంటున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. దాంతో లోతట్టు పల్లె ప్రజానీకానికి కావాల్సిన నిత్యావసర సరుకుల రవాణాకు పోలీసులు ముందుండి వారికి చేరవేయడానికి ప్రయత్నాలు ఆరంభించినట్లు సమాచారం.
యువతకు ఆట వస్తువులతో పాటు ఉపాధి, సాంకేతిక విద్య, ఆరోగ్య శిబిరాలను ఏర్పాటుచేసి దండకారణ్యంలోని జనానికి పోలీసులు అండగా నిలబడుతున్నారు. వర్షాకాలం ఆరంభంలో దండకారణ్యంలో పోలీసుల కూంబింగ్ వెనుక ఇంకా ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే అనుమానాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టుల సంచారం ఏదైనా ఉందేమోననే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. దండకారణ్యంలో పోలీసుల కూంబింగ్ అనేది ఎప్పడే జరుగుతూ ఉండేదేనని పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు.
చిత్రం..దండకారణ్యంలో కవాతు నిర్వహిస్తున్న పోలీసులు