తెలంగాణ

కేసీఆర్ ఓ నియంత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, జూన్ 29: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ దుయ్యబట్టారు. అధికారం చేపట్టిన నాటి నుండి ఆయన అరాచకాలకు అంతే లేకుండా పోయాయన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటన్‌చెరులో ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులను సైతం బెదిరించడానికి సీఎం కేసీఆర్ ఏమాత్రం వెనుకాడడం లేదన్నారు. సమ్మె నోటీసు ఇచ్చిన ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల నుండి తొలగిస్తామని ఆయన హెచ్చరిక చేయడం ఇందుకు ప్రబల నిదర్శనమన్నారు. ప్రభుత్వ విధానాలను తప్పు పడుతూ ఒకవేళ సమ్మెకు దిగితే ఎస్మా ప్రయోగిస్తామని పాలకులు బెదిరించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. చాలీచాలని వేతనాలతో బతుకుబండిని భారంగా ఈడ్చుకొస్తున్న కార్మికులు న్యాయంగా జీతాలు పెంచమని అడగడం ముఖ్యమంత్రికి తప్పుగా అనిపించిందన్నారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి ప్రభుత్వం కుట్రలు పన్నుతుందన్నారు. ఆహార భద్రత పథకం కింద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న రేషన్ డీలర్లను సైతం వదలడం లేదన్నారు. వారికి అందాల్సిన కమీషన్ వారి ఖాతాలలో జమ చెయ్యకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. సమ్మె దిగితే రేషన్ డీల ర్‌షిప్ రద్దు చేస్తామని ప్రకటించడం పాలకుల నియంతృత్వ ధోరణికి నిలువెత్తు నిదర్శనమన్నారు.
కాంగ్రెస్‌ను ఆయన చుక్కాని లేని నావలా అభివర్ణించారు. మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్న పడవని లక్ష్మణ్ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నందీశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ రాబోయె శాసనసభ ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జ్యోస్యం పలికారు. అవినీతి లేని పాలన కేవలం బీజేపీతోనే సాధ్యమని నిరూపించిన మోదీ అత్యధిక మెజారిటితో మరోసారి అధికారం కైవసం చేసుకోవడం ఎవరూ ఆపలేరని ఆయన స్పష్టం చేసారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్