తెలంగాణ

ధరణి ఆన్‌లైన్‌ను విస్తరింపజేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 30: భూరికార్డుల ప్రక్షాళన ధైర్యంతో చేపట్టిన పని అని ధైర్యం గల ముఖ్యమంత్రి ఉన్నందుకే అది సాధ్యమైందని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మహముద్ అలీ అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో జరిగిన కార్యక్రమానికి విచ్చేసిన ఆయన మహబూబ్‌నగర్ మీదుగా తిరిగి హైదరాబాద్‌కు వెళ్లారు. ఈసందర్భంగా మహబూబ్‌నగర్ నియోజకవర్గం హన్వాడ మండల కేంద్రంలో కొద్దిసేపు ఆగి టీఆర్‌ఎస్ మైనారిటీ నాయకులతో కలిసి ముచ్చటించారు. అనంతరం విలేఖరులతో ఆయన మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా డాక్యుమెంటేషన్లు చాలా తప్పుల తడకగా ఉన్నాయని, దీంతో భూ యజమానులు ఎన్నో ఏళ్ల నుండి చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించి భూ రికార్డుల ప్రక్షాళన నిర్ణయం తీసుకున్నారన్నారు. గత ఐదారు నెలలుగా భూరికార్డుల ప్రక్షాళన ఓ యజ్ఞంలా కొనసాగిందని దాంతో రికార్డుల సవరణ ఓ కొలిక్కి వచ్చిందన్నారు. ఇందులో ఇంకా 4లక్షల సమస్యలు తమ దృష్టికి వచ్చాయని వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన, పాస్ పుస్తకాలు అందజేత రైతుబంధు చెక్కుల అందజేత కార్యక్రమాన్ని రెవెన్యూ అధికారులు విజయవంతం చేశారన్నారు. వారిని తాను ప్రత్యేకంగా అభినందిస్తున్నానన్నారు. 1930లో నిజాం కాలంలో భూరికార్డుల ప్రక్షాళన జరిగిందని ఆ తర్వాత ఏ నాయకుడు కూడా వీటిని తట్టలేదన్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు వీటి జోలికి వెళ్లలేదని కేవలం రాజకీయాలు చేస్తూ పబ్బం గడిపారని ఆయన దుయ్యబట్టారు. భూరికార్డుల ప్రక్షాళనతో పాటు ఎన్నో సంస్కరణలను రాష్ట్రంలో తీసుకువచ్చామని ముఖ్యంగా కొత్తగా రైతులకు ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఆధునిక టెక్నాలజీతో రూపొందించడం జరిగిందని మార్కెట్‌లో ఎక్కడ కూడా ఇలాంటివి దొరకవన్నారు. గతంలో కొంత డబ్బు చెల్లిస్తే దొంగ పాస్ పుస్తకాలు సృష్టించుకోడానికి అవకాశం ఉండేదని వాటన్నింటికి చెక్ పడిందన్నారు. ధరణి ఆన్‌లైన్ సేవలు రాష్ట్రంలోని అన్ని మండలాలకు విస్తరింపజేస్తామని అన్ని జిల్లాల్లో ఇప్పటికే కొన్ని మండలాల్లో ప్రారంభించామన్నారు. రైతుబంధు ఓ అద్భుతమని రూ.12వేల కోట్లు కేటాయించడం జరిగిందని ఇందులో మొదటిదశగా రూ.5700 కోట్లు చెక్కుల రూపంలో రైతులకు అందజేయడం జరిగిందన్నారు. సాగునీటి రంగంలో వెనుకడుగు వేసేది లేదని తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణగా మార్చడానికి, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి సాగునీటి ప్రాజెక్టులతోపాటు తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందన్నారు. రెవెన్యూ శాఖలో ఖాళీలను భర్తి చేయడం జరుగుతుందని ఇప్పటికే కొన్ని పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందన్నారు.