తెలంగాణ

37 శాతం ఉత్పత్తి సాధించిన మందమర్రి గనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మందమర్రి, జూన్ 30: మందమర్రి ఏరియా గనులు జూన్ మాసం లో 37 శాతం ఉత్పత్తి సాధించడం జరిగిందని ఏరియా జీఎం రాఘవులు పేర్కొన్నారు. శనివారం జీఎం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 4లక్షల 43వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 1 లక్ష 38 వేల 64 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. కేకే 1, కేకే 5 గనులు 100 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించడం జరిగిందని ఈ సందర్బంగా కార్మికులను, అధికారులను అభినందించారు. కేకే ఓసి, ఆర్కే ఓసి గని స్థలాల కింద అండర్ గ్రౌండ్ గనుల నిక్షేపాలు ఉండటం వల్ల బొగ్గు ఉత్పత్తికి అటాంకం ఏర్పడుతుందని జులై 20 నాటికి ఓసిల నుండి అధిక ఉత్ప త్తి ప్రారంభం అవుతుందని ఆయన పేర్కొన్నారు. 100 శాతం ఉత్పత్తి సాధనకు కార్మికులు, అధికారులు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. సింగరేణి సేవ సమితి ఆధ్వర్యంలో ఈ నెల5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా గనులు డిపార్ట్‌మెంట్‌లలో పర్యావరణంకు సంబంధించిన అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని జూన్ 21న ప్రపంచ యోగా డే వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 27న సింగరేణి సేవ సమితి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ, యువకులకు పలు ఉపాధి కల్పించే విధంగా సింగరేణి యజమాన్యం కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.