తెలంగాణ

డీలర్‌షిప్ రద్దు అప్రజాస్వామికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి, జూన్ 30: రేషన్ డీలర్లు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తే డీలర్ షీప్‌లను రద్దు చేయడం అప్రజాస్వామికమని, తక్షణమే సస్పెన్షన్ నోటీసులు ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్‌బాబు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఐబీ అతిథి గృహ ఆవరణలో ఏర్పాట చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా ప్రజాపంపిణీ వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో అమ్మహస్తం పేరుతో బియ్యంతోపాటు ఎనిమిది రకాల నిత్యావసర వస్తువులు పం పిణీ చేశామని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం నిత్యావసర వస్తువుల్లో కోతపెట్టి కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తోందని అన్నారు. రేషన్ డీలర్లు కమీషన్ పెంచాలని అడుగుతే సస్పెన్షన్ వేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఉద్యమంలో రేషన్ డీలర్లు చురుకుగా పాల్గొన్నారని, మంత్రి ఈటెల రాజేందర్ చొరవ తీసుకోని సీఎం దృష్టికి తీసుకెళ్లే బాధ్యత తీసుకొని వారి డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.