తెలంగాణ

పోలీసు ఉద్యోగాలకు ప్రాథమిక రాత పరీక్ష షెడ్యూల్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 9: తెలంగాణ పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రాథమిక రాత పరీక్ష షెడ్యూల్‌ను సోమవారం రాష్ట్ర స్ధాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. ఎస్‌ఐ ఉద్యోగాలకు ఆగస్టు 26 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు రాత పరీక్ష నిర్వహించనున్నట్లు బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు తెలిపారు. ఎస్‌ఐ ఉద్యోగాలను హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 10 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే ఎస్‌ఐ ఐటి, కమ్యూనికేషన్స్ ఉద్యోగాలకు సెప్టెంబర్ 2 ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తుండగా, ఫింగర్‌ప్రింట్ బ్యూరోలో ఎఎస్‌ఐ ఉద్యోగాలకు సెప్టెంబర్ 2న మధ్యాహ్నాం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు సెప్టెంబర్ 30 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు రాత పరీక్ష నిర్వహస్తున్నట్లు తెలిపారు.
కానిస్టేబుల్ ఉద్యోగాలకు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరు అవుతున్నందున హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 40 ఇతర పట్టణాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే దరఖాస్తులోని పార్ట్-1లో తప్పులు ఉంటే సవరించుకునేందుకు అవకాశం కల్పించాలని కొందరు ఈమెయిల్ ద్వారా విజ్ఞప్తులు చేసిన మేరకు వారికి దరఖాస్తును సవరించుకునే అవకాశం కల్పించినట్లు చైర్మన్ వెల్లడించారు. ఎవరైతే తాము తప్పుగా పూర్తి చేసి పంపించామని భావిస్తున్నారో, అటువంటి వారు స్పష్టంగా ఈమెయిల్ ద్వారా విజ్ఞప్తి చేసి పంపాలని సూచించారు. ఈమెయిల్ పంపిన వారికి మాత్రమే ఆ వెసులు బాటు ఉంటుందని తెలిపారు. ఈ నెల 14 సాయంత్రం 5 గంటల వరకు వచ్చిన ఈమెయిల్ విజ్ఞప్తులను మాత్రమే పరిగణిస్తారని, ఆ తర్వాత వచ్చే సవరణలను పరిగణనలోకి తీసుకోమని తెలిపారు.