తెలంగాణ

కడెం ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడెం, జూలై 9: నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల మూలంగా ప్రాజెక్టు రిజర్వయర్‌లో ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో వరదనీళ్లు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరిగింది. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా గత మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలాశయంలో దాదాపు 12 వేల ఇన్‌ఫ్లో వరద నీరు వచ్చి చేరుతుండడంతో నీటి పారుదల శాఖ ఆధికారులు అప్రమత్తమై కడెం ప్రాజెక్టుకు చెందిన ఆరు, తొమ్మిది, రెండు వరద గేట్లను ఎత్తివేసి గోదావరిలోకి దాదాపు 13వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం కడెం ప్రాజెక్టు నీటి మట్టం సోమవారం సాయంత్రం 697. 700 అడుగులు ఉందని, 11 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వరద నీరు జలాశయంలో వచ్చి చేరుతుందని కడెం ప్రాజెక్టు జేఈ శ్రీనినాస్ తెలిపారు.