తెలంగాణ

వారి కుట్రలు సాగనివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 9: కాంగ్రెస్ నాయకులది రెండు నాలుకల ధోరణి అనీ.. వారి నీచ రాజకీయాలతోనే ప్రాజెక్టులకు అడ్డంకులు ఏర్పడ్డాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆరోపించారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలం సిద్దాయపల్లి గ్రామం లో నిర్మించ తలపెట్టిన 300 డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి మంత్రి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరు దేశంలోనే పేరు ప్రఖ్యాతులు రావడంతో ఇక కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ఎలాగైనా టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై అభాండాలు వేసి రాజకీయం గా లబ్ధిపొందాలని చూస్తున్నారని తెలంగాణ ప్రజలు గతంలో మాదిరిగా మోసపోరని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ విజన్‌తో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలు కేసులు వేయడంతో పనులు ఆలస్యం అయ్యాయన్నారు. ప్రాజెక్టులపై కేసులు వేస్తూనే అడ్డంకులు సృష్టిస్తూనే మళ్లీ ప్రభు త్వం ప్రాజెక్టుల పనులు చేయడంలేదని పనులు వేగవంతం చేయాలంటూ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డిలు పాలమూరు జిల్లాకు చేసింది శూన్యం అని.. వారి కుతంత్రాల రాజకీయాల కారణంగానే జిల్లాకు దారిద్య్రం పట్టుకుందని తెలిపారు. గతంలో సమైక్య పాలనలో పాలమూరు జిల్లా నిర్లక్ష్యానికి గురవుతుంటే నోరు మెదపని కాంగ్రెస్ దద్దమ్మలు ప్రస్తుతం తమపై విమర్శలు చేయడం ఏమిటని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ఎంపీగా ఉన్న సమయంలోనే సాధించడంతో పాలమూరు జిల్లాకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రతి నియోజకవర్గాన్ని సమాంతరమైన అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు ఎన్ని నిధులు ఖర్చు పెడుతున్నామో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న వాటికి సైతం అదే తరహాలో నిధులు ఇవ్వడం జరిగిందని కాంగ్రెస్ నాయకులు బుద్ధి ఉండి మాట్లాడాలని హితవుపలికారు. కాంగ్రెస్ నాయకుల తీరు మారకుంటే ప్రజలు గ్రామాల్లోకి రానివ్వకుండా తన్ని తరిమికొట్టే రోజులు వస్తాయని మంత్రి హెచ్చరించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి తీరుతామని అన్నారు. కాంగ్రెస్ నాయకులు పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చిన నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల పనులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకా ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతోనే పూర్తి చేశామని తెలిపారు. మంత్రి హరీష్‌రావు, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలు రేయంబవళ్లు ప్రాజెక్టుల దగ్గర పడుకుని పూర్తి చేశామని.. కాంగ్రెస్ సన్యాసులు గుర్తుంచుకోవాలని హితవుపలికారు. గత సంవత్సరం ఖరీఫ్, రబీ సీజన్‌లో దాదాపు 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఎఫ్పుడు ఎన్నికలు వచ్చిన కాంగ్రెస్ ఓటమి ఖాయమని.. ఆ పార్టీ నాయకులకు శృంగభంగం తప్పదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వమే ఏర్పడాలని ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యకుడు బస్వరాజ్‌గౌడ్ పాల్గొన్నారు.
చిత్రం..మహబూబ్‌నగర్ జిల్లా సిద్దయ్యపల్లి గ్రామంలో మాట్లాడుతున్న మంత్రి లక్ష్మారెడ్డి