తెలంగాణ

స్టేట్ డాటా సెంటర్‌గా కమాండ్ కంట్రోల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: హైదరాబాద్‌లో నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని రాష్ట్ర మొత్తానికి, అన్ని శాఖలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని రోజు వారి కార్యకలాపాలతో పాటు అత్యవసర సమయాల్లో అన్ని శాఖలకు ఉపయోగ పడేవిధంగా రాష్టస్థ్రాయి మల్టీ ఏజెన్సీగా ఆపరేషన్ సెంటర్‌గా తీర్చిదిద్దాలని అన్ని శాఖలు కోరుతున్నాయన్నారు. సచివాలయంలో మంగళవారం కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటుపై సిఎస్ జోషి ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. వివిధ శాఖల సమాచారాన్ని (డాటా) సమీకృతం చేయడంతో పాటుజిల్లాల సమాచారాన్ని కూడా ఇందులో నమోదు చేయాలని సిఎస్ సూచించారు. దీనికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌తో పాటు డాటా బేస్‌ను అభివృద్ధి చేయాలన్నారు. భవిష్యత్‌లో ఈ సమాచారాన్ని మున్సిపల్, విద్యుత్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, రవాణా, సాధారణ పరిపాలన, మెట్రోరైలు, ప్రణాళిక శాఖలు వినియోగించుకుంటాయని సిఎస్ అన్నారు.
పోలీసుశాఖ ఏర్పాటు చేసిన సిసి కెమెరాల ద్వారా కార్ల కండీషన్, పాత్ హోల్స్, నిర్మాణ పనులు, చెత్త రవాణా, ట్రాఫిక్ రద్దీ, వాహనాల నంబర్ల గుర్తింపు తదితర సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. ప్రతీ శాఖ తమ శాఖ సమాచారాన్ని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. డాటా బేస్ రూపకల్పన, సెంటర్ ఏర్పాటుకు ముఖ్యమైన శాఖలతో సాంకేతిక నిపుణులతో చర్చిస్తామన్నారు. వివిధ శాఖల ఆస్తుల మ్యాపింగ్, జియో ట్యాగింగ్, వాతావరణ సమాచారం, ప్రాజెక్టుల్లో నీటి నిల్వ, పంటల పరిస్థితి తదితర సమాచారాన్ని తక్కువ ఖర్చుతో పొందే అవకాశం కమాండ్ కంట్రోల్ దోహద పడుతుందని జోషి వివరించారు.

చిత్రం..సచివాలయంలో మంగళవారం కమాండ్ కంట్రోల్ కేంద్రం
ఏర్పాటుపై ఉన్నతస్థాయి సమావేశంలో మాట్లాడుతున్న సీఎస్ జోషి