తెలంగాణ

బీసీలను మోసగిస్త్తున్న ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వివిధ సామాజికవర్గాలకు చెందిన ప్రజలకు ప్రభుత్వం గొర్రెలను, చేపలనిచ్చినా, తాము సంతోషిస్తామని, బీసీల సంక్షేమానికి సంబంధించి టీఆర్‌ఎస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తొందని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ఇటీవల నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే నివేదికను బహిర్గతం చేయాలని, దీని వల్ల బీసీల జనాభా ఎంత ఉందో బయటపడుతుందని అన్నారు. ప్రజాధనంతో చేసిన ఈ సర్వే వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు.
గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన 3బీసీలకు రిజర్వేషన్లు2 అంశంపై నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి ఆయన అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ బీసీల సంక్షేమానికి ఏటా రూ. 25వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామని టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోల్లో పేర్కొన్నా, గడిచిన నాలుగేళ్లలో ఇప్పటి వరకు కేవలం ఆరు, ఏడు వేల కోట్లను మాత్రమే ఖర్చు చేసిందని వివరించారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు మొత్తం 37 మంది రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహారించగా, అందులో బీసీలు 27 మంది ఉన్నట్లు వివరించారు. ఇదే రకంగా టీఆర్‌ఎస్ పార్టీకి బీసీని అధ్యక్షుడిగా నియమించే చిత్తశుద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉందా? అని ప్రశ్నించారు. బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు, వారికి జనాభా ప్రకారం రిజర్వేషన్లను అమలు చేసే అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, పీసీసీ చీఫ్‌గా తాను ఈ హామీనిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హాయంలోనే విద్యార్థులకు పూర్తిగా ఫీజు రియంబర్స్‌మెంట్ ఇచ్చే స్కీం వచ్చిందని వివరించారు.
అనంతరం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను కోర్టు నెపం చూపుతూ 23 శాతానికి కుదించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను మెరిట్ ప్రకారం అమలు చేస్తున్నారని, కానీ రాజకీయాల్లో అణిచివేస్తున్నారని అన్నారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో రిజర్వేషన్‌కు గండికొట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు.
ఇంతకాలం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అగ్రకులాలకు చెందిన వారే అయ్యారని, ఇపుడు బీసీలు కనీసం సర్పంచ్ కావద్దని ఓర్వలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించే బిల్లును రానున్న పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేత వి.హనుమంతరావు, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి పెద్దిరెడ్డి, డా.వినయ్ శివశంకర్, డా.విశే్వశ్వరరావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, బీసీ సంఘం నేతలు నీలం వెంకటేశ్, జానపద కళాకారుల విభాగం అధ్యక్షులు రామలింగం తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో సమైక్యతను చాటుతున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, చిత్రం..టీడీపీ జాతీయ కార్యదర్శి పెద్దిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేత వీహెచ్, ఇతర పార్టీల నాయకులు