తెలంగాణ

గాంధీభవన్ ముందు ఎన్‌ఎస్‌యూఐ నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 12: ఎన్‌ఎస్‌యూఐ ఎన్నికల్లో జరిగిన అవకతవకలు సరిచేయాలని డిమాండ్ చేస్తూ ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు గురువారం గాంధీభవన్ ముందు నిరసన చేపట్టారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన వినయ్ పటేల్ ఆధ్వర్యంలో సుమారు వంద మంది కార్యకర్తలు గాంధీ భవన్ ప్రధాన ద్వారం వద్ద నిరసనకు దిగారు. పార్టీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా పార్టీ కార్యకలాపాలు సాగేలా చూడాలని కోరారు. ప్లకార్డులను చేతపట్టుకొని సుమారు గంటపాటు నిరసన కొనసాగించగా పార్టీ అగ్రనేతలు వారితో చర్చలు జరిపి సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించడంతో విరమించారు. అనంతరం జాతీయ ఎన్నికల పర్యవేక్షణ ప్రతినిధికి ఫిర్యాదు చేశారు.