తెలంగాణ

ముందస్తుకేనా బహిరంగ సభ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్,జూలై 12: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన హరితహార కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 17న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో హరితహారం, అక్కడే భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో ఇక్కడ ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగసభకు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. పరోక్షంగా ఈ బహింగసభ ద్వారనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముందస్తు ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుడుతారనే పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. అందులోభాగంగానే భూపాలపల్లి జిల్లా గణపూర్ మండలం మైలారం - రేగొండ మండలం పాండవుల గుట్ట వద్ద అనువైన స్ధలంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. భూపాలపల్లి ఎమ్మెల్యే, శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి బహిరంగ సభ, హరితహార ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే భూపాలపల్లి జిల్లాలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ నాయకుల మధ్య అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరు జరుగుతోంది. మరోసారి ఇక్కడి నుండే పోటీ చేసేందుకు స్పీకర్ సిద్ధమవుతుండగా ఎమ్మెల్సీ కొండా మురళి కూతురు సుస్మితాపటేల్‌ను భూపాలపల్లి నుండే పోటీచేస్తుందని కొండా మురళి, ఎమ్మెల్యే కొండా సురేఖ బహిరంగంగానే అంటుండటంతో ఇద్దరి అగ్రనేతల మధ్య పోటాపోటీ నెలకొంది. మరోవైపు ఇటీవలే టీడీపీ నుండి టీఆర్‌ఎస్‌లో చేరిన గండ్ర సత్యనారాయణరావు కూడా భూపాలపల్లి నుండే పోటీకి సై అంటున్నాడు. ఈ ముగ్గురు నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారు తలమునకలై ఉన్నారు. గత కొన్ని నెలలుగా ఈ నేతల మధ్య భూపాలపల్లి టికెట్ కోసం వార్ జరుగుతోంది. ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు కూడా చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ ఈ జిల్లాలో ప్రారంభించే హరితహారం, బహిరంగసభపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. 4వ విడత హరితహారంలో రాష్ట్ర వ్యాప్తంగా 40కోట్ల మొక్కలు లక్ష్యంగా ప్రభుత్వం ఎంచుకుంది. వచ్చే ఏడాది 100కోట్ల మొక్కల టార్గెట్‌తో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్ భూపాలపల్లి జిల్లాలో ప్రారంభించే హరితహారం, బహిరంగ సభ ఏర్పాట్లను శుక్రవారం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, స్పీకర్ పరిశీలించారు. 40 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు ఇప్పటికే కోటీ 13లక్షల మొక్కలను అధికారులు నర్సరీలో సిద్ధం చేసారు. భూపాలపల్లి జిల్లా పేరుకే రిజర్వ్ ఫారెస్టు కాని అది 25శాతం మాత్రమే ఉంటుంది. అడవులను 33 శాతానికి పెంచాలన్నదే ప్రభుత్వం లక్ష్యం. సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన కడియం శ్రీహరి ఈనెల 17 లేదా 18న జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సీఎం కేసీఆర్ రానున్నట్లు వెల్లడించారు.
చిత్రం..జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఎం పాల్గొనే బహిరంగసభ, హరితహారం
ఏర్పాట్లను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం కడియం, స్పీకర్ మధుసూదనాచారి