తెలంగాణ

రాష్ట్రానికి ప్రత్యేకంగా ఫార్మసీ కౌన్సిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: తెలంగాణ విద్యార్ధులకు ప్రత్యేకంగా ఫార్మసీ కౌన్సిల్ ప్రారంభమైంది. ఈ కౌన్సిల్ 16వ తేదీ నుండి పని ప్రారంభిస్తుందని కౌన్సిల్ అధ్యక్షులు, సీనియర్ ఐఎఎస్ అధికారి డాక్టర్ ప్రీతి మీనా తెలిపారు. తెలంగాణకు ప్రత్యేకించి ఫార్మసీ కౌన్సిల్ లేకపోవడంతో చాలా కాలంగా తెలంగాణ ఫార్మసీ విద్యార్ధులు తమ సర్ట్ఫికేట్లను రిజిస్ట్రేషన్ చేయించుకోలేక నానా అగచాట్లు పడుతున్నారు, దీనిపై శాసనసభలోనూ చర్చ జరిగింది. ఎట్టకేలకుస ప్రభుత్వ చొరవతో కౌన్సిల్ ఏర్పాటైంది. డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, డాక్టర్ ఇన్ ఫార్మసీ, డాక్టరేట్ ఇన్ ఫార్మసీ కోర్సులు చేసిన వారు ఇక తమ సర్ట్ఫికేట్లను రిజిస్టర్ చేసుకునే వీలు కలిగింది. వీంతా వెంగళరావునగర్‌లోని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌన్సిల్ కార్యాలయంలో హాజరుకావాలని అంతకంటే ముందు ఫార్మసీ కౌన్సిల్ డాట్ తెలంగాణ డాట్ జీవోవీ డాట్ ఇన్ అనే వెబ్‌పోర్టల్‌లో స్లాట్ తీసుకోవాలని ప్రీతా మీనా సూచించారు.