తెలంగాణ

సర్పంచ్ నుండి పెద్దల సభకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూరాబాద్, మే 26: టిఆర్‌ఎస్ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా కెప్టెన్ వొడితెల లక్ష్మీకాంతరావు ఖరారు కావడంతో ఆయన సన్నిహితులు, అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్ కుటుంబం మొదటి నుండి రాజకీయాల్లో ఉంది. హుజూరాబాద్ మండలం సింగాపురం గ్రామానికి చెందిన కెప్టెన్ వి.లక్ష్మికాంతరావు అంకితభావంతో పనిచేస్తూ, క్రియాశీల రాజకీయాల్లో ఎదిగారు. కెప్టెన్ సోదరుడు స్వర్గీయ వొడితెల రాజేశ్వర్‌రావు గతంలో రాజ్యసభ సభ్యునిగా కీలక భూమిక పోషించారు. నాడు సోదరుడు రాజేశ్వర్‌రావు రాజ్యసభ సభ్యునిగా పనిచేయగా నేడు కెప్టెన్‌కు ఆ అవకాశం రావడం గమనార్హం. బి ఎస్సీ పూర్తిచేసిన కెప్టెన్ లాల్ బహదూర్ శాస్ర్తీ ఇచ్చిన జై జవాన్ జై కిసాన్ పిలుపుకు ఆకర్షితుడై సైన్యంలో చేరారు. కెప్టెన్‌గా పనిచేసి భారత్ - పాకిస్తాన్, భారత్ - చైనా యుద్ధంలో కూడా పాల్గొన్నారు. అలాగే రైతుగా, ఇంజనీరింగ్‌తో పాటు ఇతర విద్యాసంస్థలను స్థాపించి పేరుపొందారు. కెప్టెన్ మొదట 1973లో సర్పంచ్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 1995లో ఎంపిటిసిగా, 2004లో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. మొదట కాంగ్రెస్ పార్టీలో ఉండి, టిఆర్‌ఎస్ అవిర్భావం నుండి కెసిఆర్‌కు వెన్నంటి ఉన్నారు. 2001 నుండి నేటి వరకు క్రియాశీలకంగా పనిచేస్తూ కెసిఆర్‌కు, పార్టీకి విధేయుడిగా ఉన్నారు. పార్టీ పరంగా కూడా పొలిట్‌బ్యూరో సభ్యునిగా, కరీంనగర్ జిల్లా టిఆర్‌ఎస్ అధ్యక్షునిగా కూడా పనిచేశారు. కెప్టెన్ సేవలను గుర్తించిన కెసిఆర్ ఆయనకు రాజ్యసభ ఎన్నికలో అభ్యర్థిగా ప్రకటించడం పట్ల హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లోని వారి అభిమానుల్లో, ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా కెప్టెన్ కుమారుడు వొడితెల సతీష్‌కుమార్ హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కెప్టెన్ సతీమణి సరోజన హుజూరాబాద్ ఎంపిపిగా ఉన్నారు.