తెలంగాణ

పులుల సంరక్షణాధికారిగా రాజా రమణారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: పులుల సంరక్షణాధికారిగా అరణ్యభవన్‌లో అసిస్టెంట్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(లా)గా విధులు నిర్వహిస్తున్న రాజా రమణా రెడ్డి నియమితులయ్యారు. అభయరణ్యంలోని పులల సంరక్షణపై దృష్టి సారించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో అడవి జంతువుల వేట నియంత్రణాధికారిగా రాజా రమణారెడ్డి ఐదేళ్ల పాటు విధులు నిర్వహించారు. ఈ కాలంలో ఆయన సుమారు 180పైగా కేసులు నమోదు చేసి, వేటగాళ్ల భారీ నుంచి మూగజీవాలను కాపాడారు. అనుభవంతో పాటు నైపుణ్యం ఉండటంతో ప్రభుత్వం ఈ మేరకు ఆసీఫాబాద్ డీఎఫ్‌ఓగా ఆయన బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే ఈ అడవిలో ఫల్గున అనే పులి మూడు పులి కూనలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దీనికి తోడు ఇదే అడవుల్లో అంతరించి పోతున్న రాబందుల సంరక్షణ కేంద్రం సైతం ఉంది.