తెలంగాణ

70 పెట్రోలు బంకులపై దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: పెట్రోలు, డీజిల్ కొంటున్నారా?..జర జాగ్రత్త!. అడుగడుగునా కల్తీ, నాసిరకం, నాణ్యత లేకపోవడం వంటి వాటితో ప్రజలు బేజారెత్తుతున్నారు. వాహనంలో ఇంధనం పోయించాలన్న అవకతవకలు. రాష్ట్రంలోని అనేక పెట్రోలు బంకులపై అవకతవకల ఆరోపణలు రావడంతో తూనికల కొలతల శాఖ శుక్రవారం రాష్టవ్య్రాప్తంగా పెట్రోలు బంకులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది.
రాష్ట్రంలోని 70 పెట్రోలు బంకుల్లో తనిఖీలు నిర్వహించగా కొలతల్లో మోసాలకు పాల్పడుతున్న 10 బంకులపై తూనికల, కొలతల శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. ఇందులో 7 బంకుల్లో డీజిల్ తక్కువగా పోస్తున్నందున కేసులు చేశారు. కాగా లైసెన్సు గడువు ముగిసినా రెన్యువల్ చేసుకోకపోవడానికి సంబంధించి 3 బంకులపై కేసులు నమోదు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిథిలోని ఉప్పల్ ఐడిపిఎల్‌లోని ఫార్చ్యున్ ప్యుయల్ హెచ్‌పిసిస పెట్రోలు మంకుల్లో అసిస్టెంట్ కంట్రోలర్ జగన్మోహన్ అధ్వర్యంలోని బృందం తనిఖీలు నిర్వహించగా 5 లీటర్ల డీజిలుకు 300 ఎంఎల్ తక్కువగా పోస్తున్నారని గుర్తించి కేసు నమోదు చేశారు. అదేవిధంగా మేడ్చల్‌లో 1, సిరిసిల్ల-2, భువనగిరి-1, సూర్యాపేట-1, భద్రాచలం-1, హైదరాబాద్-1, నిర్మల్-2, మెదక్-1 పెట్రోలు బంకులపై కేసులు నమోదు చేసినట్లు తూనికల, కొలతల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.