తెలంగాణ

అట్టహాసంగా టీటీఎఫ్ ఆరంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: దేశ, విదేశాల్లో సుప్రసిద్ధమైన ప్రదేశాలకు పర్యాటకులను తీసుకెళ్ళి కనువిందు చేసేందుకు వివిధ సంస్థలు ముందుకు వచ్చాయి. నగరంలోని హెచ్‌ఐసిసి వేదికగా ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ (టీటీఎఫ్) శుక్రవారం ప్రారంభమైంది. రెండో రోజు శనివారం కూడా కొనసాగుతుంది. 12 దేశాలు, 19 రాష్ట్రాల నుంచి 180 మంది ఎగ్జిబిటర్లు ట్రావెల్ అండ్ టూరిజంలో పాల్గొంటున్నారు. శ్రీ లంక టూరిజం ప్రమోషన్ బ్యూరో పెద్ద ఎత్తున ప్రతినిధులతో పాల్గొనడం విశేశం. బహ్రెయిన్ ఫీచర్ కంట్రీగా వ్యవహరిస్తుంటే, భారత్, చైనా, దుబాయ్, ఇండోనేషియా, మలేషియా, మాల్డీవులు, నేపాల్, రష్యా, స్విట్జర్లాంట్, థాయ్‌లాండ్ తదితర దేశాలు టీటీఎఫ్‌లో పాల్గొంటున్నాయి.
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లు అతిథ్య రాష్ట్రాలుగా పాల్గొంటుండగా, గోవా, గుజరాత్, కర్నాటక భాగస్వామ్య రాష్ట్రాలుగా పాల్గొంటున్నాయి. ఇతర రాష్ట్రాలలో అస్సాం, జమ్మూ-కాశ్మీర్, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ఉన్నాయి. టీటీఎప్ హైదరాబాద్‌లో అండమాన్ నికోబార్, చండీఘడ్, కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సా, సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలూ పాల్గొంటున్నాయి. దేశ వ్యాప్తంగా 24 కార్పోరేట్స్, 160 ట్రావెల్ ట్రేడ్ బయ్యర్లు హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో విడది చేశారు.