తెలంగాణ

నరసింహారెడ్డికి ఉప రాష్టప్రతి అభినందనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 23: దేశ సంస్కృతిలో మూలంగా నిలిచిన నాలుగు వేదాలను సులభమైన తెలుగు భాషలో అనువదించినందుకు తెలంగాణ తెలుగు భాషా సంరక్షణ సంఘం అధ్యక్షుడు ఎం వీ నరసింహారెడ్డికి ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు అభినందించారు. వసుదైక కుటుంబం, సర్వేజనా సుఖినోభవంతు అనే భావనలు ఆచరణాత్మకంగా అనుసరించిన భారతీయ సంస్కృతికి మూలమైన రుగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వవేదాలను సరళమైన తెలుగులో నరసింహారెడ్డి అనువాదం చేశారు. వేదాల్లో ఏముంది అని ప్రశ్నించేవారికే గాక వేదాల గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఈ వచనానువాదం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నట్టు ఉప రాష్టప్రతి రాసిన లేఖలో పేర్కొన్నారు. సృష్ట్ధిర్మానికి, మానవ ధర్మానికి, సకల ధర్మాలకు మూలంగా మన పెద్దలు అందించిన వేదాలను అందరికీ చేరువ చేయాలన్న సంకల్పం ఉన్నత మైనదని ఆయన పేర్కొన్నారు. మాతృభాషలో నిపుణులను తయారు చేస్తున్నందుకు కౌసల్య తెలుగు పండిత శిక్షణ సంస్థ ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్న నరసింహారెడ్డిని ఉప రాష్టప్రతి అభినందించారు.