తెలంగాణ

తెలంగాణలో అడుగులేస్తున్న ‘ఆప్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 23: ఆమ్ ఆద్మీ పార్టీ తన చెట్టు కొమ్మలను తెలంగాణలోనూ విస్తరించేందుకు వ్యూహ రచన చేస్తున్నది. ఇందులో భాగంగానే తెలంగాణలో అడుగు వేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ శిష్యురాలు తెలంగాణ ప్రియాంక కర్కర్ మూడు రోజులుగా నగరంలోనే మకాం వేశారు. ఆదివారం నగరంలోని ఒక హోటల్‌లో పార్టీ తెలంగాణ విభాగం ముఖ్య నేతలతో (కోర్ కమిటీ) సమావేశమై చర్చించారు. పార్టీ విస్తరణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆమె వారికి వివరించారు. వచ్చే నెల 16న హిమాయత్‌నగర్‌లోని ఎవి కళాశాల మైదానంలో ‘సామాన్యుల సమర భేరి’ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. ఎన్నికలకు సంవత్సరం కూడా లేనందున, పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని భావించారు. ఈ సందర్భంగా ప్రియాంక కర్కర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ‘ఆప్’ బీజం పడిందన్నారు. త్వరలో మొక్కగా, వటవృక్షంగా మారుతుందని ఆమె ధీమాగా చెప్పారు. తెలంగాణలో ‘సున్నా’ నుంచే ప్రారంభిస్తున్నామని ఆమె తెలిపారు. అయితే ఆ సున్నాకే ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. సున్నా లేకపోతే ఈ అంకెకూ విలువ లేదన్నారు. ఎన్నికలకు ముందు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్నది ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేదని ఆమె చెప్పారు. తాము బలపడితే మిగతా పార్టీలే తమతో కలిసేందుకు ఉత్సాహం కనబరుస్తాయని ఆమె తెలిపారు. ఆ దిశగా పార్టీనీ విస్తరిస్తామని అన్నారు. వచ్చే నెల 16న సామాన్యుల సమర భేరి అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపడతామని ప్రియాంక కర్కర్ తెలిపారు. అవినీతిలో తెలంగాణ రెండవ స్థానంలో నిలిచిందని, కుటుంబ పాలన కొనసాగుతున్నదని కర్కర్ విమర్శించారు. ఇంకా ఈ సమావేశంలో కోర్ కమిటీ సభ్యులు బి. రాముగౌడ్, శ్రీదేవి, పార్టీ జిల్లా కన్వీనర్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు.