తెలంగాణ

జూరాలకు స్వల్పంగా తగ్గిన వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, జూలై 23: ఎగువ ప్రాంతంలోని ఆల్మటి, నారాయణపూర్ జలాశయాల నుంచి వస్తున్న వరద నీరు స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో జూరాలకు 1,58,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదయింది. సోమవారం సాయంత్రం నాటికి జూరాల జళాశయంలో 318.34 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉంచుకొని ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న లక్షా 58వేల క్యూసెక్కుల వరద నీటిని 13 గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు. జూరాల కుడి, ఎడుమ కాలువలకు 1227 క్యూసెక్కులు, నెట్టెంపాడుకు లిప్ట్‌కు 2250, బీమా లిప్ట్-1, లిప్ట్-2లకు 2050, కోయిల్‌సాగర్ 315, సమాంతర కాలువలకు 1100, విద్యుత్ ఉత్పత్తికి 42,000 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టు నుండి దిగువకు వదులుతున్నట్లు జూరాల అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతం నుంచి వరద ఉదృత్తిని ఎప్పటికప్పుడు అంచనావేస్తున్న అధికారులు అంతే స్థాయిలో 1,50,546 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి జళాశయంలో 129.72 టీఎంసీలకు గాను 113.89 టీఎంసీల నీటిని నిలువ ఉంచుకొని దిగువకు 1,72,286 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి ఆల్మట్టికి 1,77,150 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. నారాయణపూర్ జళాశయంలో 37.64 టీఎంసీలకు గాను 33.87 టీఎంసీల నీరు నిలువ ఉంది. ఎగువ ప్రాంతం నుంచి 1,77,286 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా దిగువకు 1,67,560 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాలకు వస్తున్న వరద నీటి ఉద్ధృత్తిని వరద నియంత్రణ కార్యాలయ అధికారులు పర్యవేక్షిస్తు గేట్లను సరిచేస్తున్నారు. జూరాలకు వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకొని జూరాల జలవిద్యుత్ కేంద్ర అధికారులు దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల ద్వారా 10 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నట్లు జెన్‌కో అధికారులు తెలిపారు.

చిత్రం..తుమ్మడిహెట్టి వద్దే ప్రాణహిత బ్యారేజీ