తెలంగాణ

స్వయం ఉపాధి పథకాలలో బీసీలకు భారీగా సబ్సిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 26: రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల (బీసీ) ప్రజలు స్వయం ఉపాధి పథకాలు చేపట్టేందుకు ముందుకు వస్తే భారీగా సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా గురువారం జీఓ జారీ అయింది. బీసీ సహకార ఆర్థిక సంస్థ, బీసీ ఫెడరేషన్ల ద్వారా సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దరఖాస్తులను స్క్రూటినీ చేసేందుకు జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా కమిటీలను నియమించారు. ఈ మేరకు గురువారం బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బి. వెంకటేశం పేరుతో జీఓ జారీ అయింది. 50 వేల రూపాయల వరకు పెట్టుబడి అవసరం అయ్యే యూనిట్లకు 100 శాతం సబ్సిడీ ఇస్తారు. 50 వేల నుండి లక్ష రూపాయల వరకు ఖర్చయ్యే యూనిట్లకు 80 శాతం సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే లక్ష రూపాయల నుండి రెండు లక్షల రూపాయల వరకు పెట్టుబడి అవసరం అయ్యే యూనిట్లకు 70 శాతం సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. రెండు లక్షల రూపాయల నుండి 12 లక్షల రూపాయల వరకు పెట్టుబడి అవసరం అయ్యే యూనిట్లకు సంబంధించి ఐదు లక్షల రూపాయల పరిమితి వరకు 60 శాతం సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. యూనిట్ ఖర్చు 12 లక్షల రూపాయలైనప్పటికీ ఐదు లక్షల వరకే సబ్సిడీ వర్తిస్తుంది. బీసీల్లోని అన్ని వర్గాలకు చేయూత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.