తెలంగాణ

మా సర్వీసులను క్రమబద్ధీకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 26: కాంట్రాక్టు అధ్యాపకులకు ఎపుడెపుడు మోక్షం కలుగుతుందా అని ఎదురుచూస్తున్న అధ్యాపకులు వారి కుటుంబాలకు 27న జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో చట్టసవరణ నిర్ణయం తీసుకుని సర్వీసులను క్రమబద్ధీకరించాలని తెలంగాణ కాంట్రాక్టు అధ్యాపక సంఘం రాష్ట్ర నాయకులు కొప్పిశెట్టి సురేశ్, సయ్యద్ జబీ ఉల్లా, శ్రీనివాస్‌రెడ్డి, దేవందర్, శోభన్ కోరారు. ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి తమ సమస్యలపై అవగాహన ఉందని, కాంట్రాక్టు అధ్యాపకుల బతుకులు చాలా దారుణంగా ఉన్నాయని, ప్రభుత్వం 12 నెలల జీతాలకు హామీ ఇచ్చినా, ఇంకా పది నెలలే జీతాలు ఇస్తోందని వారు చెప్పారు. చాలా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, తమ సమస్యలు ఎక్కడివి అక్కడే ఉన్నాయని, ఒక్క సమస్య కూడా పరిష్కారానికి నోచుకోలేదని, డిఎ, సిఎల్స్, బదిలీలు, ప్రసూతి సెలవులు, ఆరోగ్య బీమా అలాగే పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. సంవత్సరాల తరబడి ఒకేచోట పనిచేస్తూ తల్లిదండ్రులకు, భార్యపిల్లలకు సేవ చేయలేకపోతున్నామనే ఆందోళనలో ఉన్నామని, కనీసం బదిలీలు చేసి స్వంత జిల్లాలకు తమను పంపించాలని అన్నారు. రెగ్యులరైజేషన్‌కు ఆర్ధిక భారం అంటున్న ప్రభుత్వం బదిలీలకు ఎలాంటి ఆర్ధిక భారం లేకున్నా అది కూడా చేయడం లేదని వారు చెప్పారు. ముఖ్యమంత్రి పట్టించుకుని సుదూర ప్రాంతాల్లో పనిచేసే వారిని తక్షణమే సొంత జిల్లాలకు పంపించాలని, అలాగే మంత్రిమండలి సమావేశంలో క్రమబద్ధీకరణపై నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.