తెలంగాణ

పోడు భూములు లాక్కుంటే సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 26: హరితహారం పేరుతో పోడు భూములను లాక్కొంటే సహించబోమని రాష్ట్ర సదస్సులో వక్తలు హెచ్చరించారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో పోడు భూముల రక్షణకై రాష్ట్ర సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు వామపక్ష నేతలు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్‌రెడ్డి, సున్నం రాజయ్య, రంగారావు, తండ్ర కుమార్, సాగర్, పశ్యపద్మ, జానకి రాములు, ప్రసాద్, వేణు హాజరై ప్రసంగించారు. మొక్కలు నాటడానికే కాదు ప్రభుత్వం భూముల్లో ఉన్న ఖనిజ సంపదను కార్పోరేట్ శక్తులకు దోచి పెట్టడానికి గిరిజునులు సాగు చేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం ఇందులో దాగి ఉందని తమ్మినేని మండిపడ్డారు. అడవిని, పోడు భూములను ఆధారంగా చేసుకొని జీవనం కొనసాగిస్తున్న గిరిజనులను అడవి నుంచి బలవంతంగా పంపించే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వామపక్షాలు ఐక్య ఉద్యమాల ద్వారా కౌలీదారి చట్టం, అటవీ హక్కుల చట్టం వచ్చిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. భూ పోరాటాలు నిర్వహించి ప్రభుత్వాల మెడలు వంచిన చరిత్ర ఎర్ర జెండా పార్టీలకు ఉందన్నారు. బూర్జువా పాలకుల విధానల వల్లనే దేశంలో, రాష్ట్రంలో పేదలు, గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అధికారంలో వస్తే దళితులకు, గిరిజనులకు మూడు ఎకరాల భూమి ఇస్తానన్న కేసీ ఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత గిరిజునలు సాగు చేసుకుంటున్న భూములను లాక్కొంటున్నారని దుయ్యబట్టారు. రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు ప్రత్యేక హక్కులు ఉన్నా వాటిని కాలరాస్తూ బలవంతంగా అడవుల నుంచి పంపించి వేస్తున్నారని అన్నారు. పోడు వ్యవసాయ దారులకు రైతుబంధు ఇవ్వక పోగా వారిని పూర్తిస్థాయిలో తరిమివేసే కుట్రకు ప్రభుత్వం తెరలేపిందని విర్శించారు. తాము హరితహారినికి వ్యతిరేకం కాదని, అదే సమయంలో గిరిజనులు, ఆదివాసిల హక్కులకు భంగం కలిగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే పోడు భూముల సమస్యలపై లోతుగా అధ్యయణం జరిపి వారికి న్యాయం చేయాలని సదస్సు డిమాండ్ చేసింది.