తెలంగాణ

కొంపముంచిన అవిశ్వాసం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూలై 26: ఎన్నికల దగ్గరపడుతున్న కొద్దీ ఉమ్మడి వరంగల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయ. అధికార పార్టీ నేతలే అధికార పార్టీ మున్సిపల్ చైర్‌పర్సన్‌పై పెట్టిన అవిశ్వాసం టీఆర్‌ఎస్ కొంప ముంచింది. ఎమ్మెల్యే అసమర్థత కాంగ్రెస్ సొమ్ము చేసుకుంది. అధికార పార్టీ చేతిలో ఉన్న వరంగల్ రూరల్ జిల్లా పరకాల మున్సిపల్ పీఠం అనూహ్యంగా హస్తగతం అయిపోయింది. గత 20 రోజులుగా పరకాల మున్సిపల్ పీఠంపై జరుగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెర పడింది. కాంగ్రెస్ పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జి ఇనగాల వెంకట్రాంరెడ్డి చక్రం తిప్పి అనూహ్యంగా పరకాల మున్సిపల్ పీఠంపై గురువారం కాంగ్రెస్ జెండా ఎగిరింది. మొజా ర్టీ జిల్లాలో విపక్షాల చేతిలో ఉన్న మున్సిపల్ పీఠాలు అవిశ్వాసం పేరుతో అధికార పార్టీ చేజిక్కించుకోవడం సహజం. అయితే, వరంగల్ రూరల్ జిల్లా పరకాల మున్సిపల్ పీఠం స్వయంకృత అపరాధంతో కాంగ్రెస్‌కు కలిసి వచ్చింది. దీంతో ఈ ఫలితాలు రేపటి అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్‌కు నాంది అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు సంబురాలు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు విసిగిపోయారని 2019 ఎన్నికల్లో అటూ కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం అని అన్నా రు. పరకాల మున్సిపల్ చైర్‌పర్సన్ మార్త రాజభద్రయ్య, వైస్ చైర్‌పర్సన్ దేవునూరి రమ్యక్రిష్ణలపై తెరాస కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. తెరాసకు చెందిన మార్త రాజభద్రయ్యపై తెరాస కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేసి ఈనెల 5న కలెక్టర్ హరితకు అందచేశారు. కలెక్టర్ హరిత చైర్‌పర్సన్ రాజభద్రయ్య, వైస్ చైర్‌పర్సన్ దేవునూరి రమ్యక్రిష్ణలపై ఈనెల 26 అవిశ్వాసంపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో కలత చెందిన చైర్‌పర్సన్ మార్త రాజభద్రయ్య ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఒంటెద్దు పోకడలు, ఎమ్మెల్యే తీరు నచ్చకపొవడంతో పాటు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కాంట్రాక్ట్ రోడ్లకు మొరం తరలింపులు చేయడం, నాణ్యత లేని పనులు చేస్తే తప్పులేదని కేవ లం తనను అవినీతిపరుడని ఎమ్మెల్యే ఆరోపించడంపై ఆవేదనకు లోనైన చైర్ పర్సన్ రాజభద్రయ్య ఇనగాల ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలోకాంగ్రెస్‌లో చేరారు. అయితే, జిల్లా కలెక్టర్ హరిత ఆదేశాల మేరకు గురువారం పరకాల మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌లపై వరంగల్ రూరల్ ఆర్డీవో మహేందర్‌జీ అవిశ్వాసంపై సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 11-30 గంటలకు నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి తెరాస కౌన్సిలర్లు ఇద్దరు హాజరు మాత్రమే హాజరయ్యారు.
అయితే, కోరం లేనందున ఆర్డీవో మహేందర్‌జీ సమావేశాన్ని మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు చైర్‌పర్సన్‌పై నిర్వహించిన అవిశ్వాస తీర్మాన సమావేశానికి కౌన్సిలర్లు ఎవరూ హాజరుకాలేదు. దీంతో పరకాల మున్సిపల్ చైర్‌పర్సన్ మార్త రాజభద్రయ్యపై తెరాస కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపొయిందని వరంగల్ రూరల్ ఆర్డీవో మహేందర్‌జీ ప్రకటించారు. చైర్‌పర్సన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగిపోవడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకొన్నారు.

చిత్రం..పరకాల మున్సిపల్ కార్యాలయం