తెలంగాణ

రైతు సంక్షేమమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హత్నూర, జూలై 26: తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని చందాపూర్, రెడ్డిఖానాపూర్ గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ప్రారంబోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల కోసం అహర్నిశలు కృషి చేస్తోందని అన్నారు. రైతుబంధు పథకం ద్వారా పంట పెట్టుబడి, పంటల బీమాతో రైతులు ధీమాగా ఉండటానికి ఆవసరమైన పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. నాలుగు సంవత్సరాల కాలంలో ఉమ్మడి జిల్లాలో విద్యుత్ కోసం కోట్లాది నిధులను ఖర్చు చేశామని తెలిపారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి తాగునీటిని ఆగస్టు చివరి వరకు మండలానికి అందించాలని అధికారులను అదేశించారు. మిషన్ కాకతీయతో చెరువులు, కుంటలను మరమ్మతులు చేసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. త్వరలో సికింద్లాపూర్, పన్యాల సబ్‌స్టేషన్ల ప్రారంబోత్స కారక్రమాన్ని నిర్వహించుకుందామని స్పష్టం చేసారు. రెడ్డిఖానాపూర్ సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ.35 లక్షలు, విలేజ్ కమ్యూనిటీ హాల్ కోసం రూ. 25 లక్షలు, అంగన్‌వాడీ భవన నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. చందాపూర్‌లో నిర్మించిన మార్కెట్ గోదాంను ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రూ.1.50 కోట్లతో నిర్మించిన గోదాంను సబ్ మార్కెట్ నిర్మాణంకు ఆవసరమైన నిధులు,ప్రణాళిక రూపోందించాలని అధికారులను అదేశించారు.ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేపడుతున్న పథకాలు దేశానికే ఆదర్శం అన్నారు.
మండలానికి రెండు చెక్‌డ్యాంలు
మండలంలోని పన్యాల, నవాబ్‌పేట్ గ్రామాలలో రెండు చెక్‌డ్యాంలను నిర్మించడానికి అవసరమైన రూ.17 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేసారు. రెండు చెక్‌డ్యాంలను పూర్తి చేయడం వల్ల మండలం పంటల సాగుతో సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభు త్వం గ్రామాల అభివృద్ధికి ఆవసరమైన నిధులను కేటాయిస్తుందని ఆ నిధులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డిలు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. హత్నూర మండలం అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించనున్నట్లు వారు పేర్కొన్నారు. అంతకు ముందు మంత్రిని, ప్రజాప్రతినిధులను బైక్ ర్యాలీతో సాంప్రదాయ బ్యాండు మేళాలతో భారీ ఉరేగింపు నిర్వహించి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ రాజమణి మురళీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..హత్నూర మండలంలో నిర్వహించిన సభలో మాట్లాడుతున్న మంత్రి హరీష్‌రావు