తెలంగాణ

ధర్మపురికి కొత్త పాలక మండలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 26: జగిత్యాల జిల్లా ధర్మపురి ఆలయానికి కొత్త పాలక మండలిని ప్రభుత్వం నియమించింది. అదే విధంగా సంగారెడ్డి జిల్లా జరాసంఘంలలోని ఆలయానికి కూడా కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తూ తెలంగాణ సర్కారు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి 14 మందిని సభ్యులుగా నియమించారు. నియామకం అయినవారిలో అల్లాల శ్రీకాంతరెడ్డి, అక్కనపల్లి సునీల్‌కుమార్, సాయిని శ్రీనివాస్, ఇనగంటి వెంకటేశ్వరరావు, దోమకొండ తిరుపతి, మామిడి లింగన్న, రాచకొండ నరేందర్, కోట బుచ్చిగంగాధర్, జెట్టి రాజన్న, మధునటరాజ్, శివనీతి రమ్య, ముర్కి భాగ్యలక్ష్మి, జొగినిపల్లి రమాదేవి, అల్లోళ్ల మురళీధర్ రెడ్డి ఉన్నారు. లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ప్రధాన అర్చకుడు నంబి రఘునాథా చారి ఎక్స్-అఫీషియో సభ్యుడిగా ఉంటారని జీఓలో వివరించారు. కాగా, సంగారెడ్డి జిల్లా జరాసంఘంలోని కేతకి సంఘమేశ్వరస్వామి ఆలయానికి కూడా 13 మందితో పాలక మండలిని నియమిస్తూ జీఓ జారీ అయింది. పాలక మండలిలో నియామకం అయిన వారిలో జీ. నర్సింహగౌడ్, ఎం. పండరినాథ్, ఎం. సంతోష్‌కుమార్, ఎం. వెంకటేశం, బీ. సంగన్న, పీ. విష్ణువర్ధన్‌రెడ్డి, ఉర్మిల, సంఘమేశ్వర్, హనుమంతరెడ్డి, లక్ష్మయ్య, నాగన్న, బాపన్న, ఓదెల ప్రభుగుప్త ఉన్నారు. ఆలయ అర్చకులు బసవయ్య స్వామి ఎక్స్-అఫీషియో సభ్యుడిగా వ్యవహరిస్తారు. రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ ముఖ్యకార్యదర్శి ఎన్. శివశంకర్ పేరు తో గురువారం ఈ జీఓలు జారీ అయ్యాయి.