తెలంగాణ

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో సమగ్ర సర్వేకు స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సమగ్ర సర్వేకు అరుదైన గౌరవం దక్కింది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ సమగ్ర కుటుంబ సర్వేను జాతీయ రికార్డుగా గుర్తించింది. ఈ మేరకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎడిటర్ విజయ ఘోష్ తెలంగాణ ప్రభుత్వానికి పత్రాన్ని పంపారు. సమగ్ర కుటుంబ సర్వే జరిగిన విధానం తదితర వివరాలను కూడా పత్రంలో పేర్కొన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో జరగని విధంగా ఒకే రోజు రాష్టవ్య్రాప్తంగా 4 లక్షల మంది ఉద్యోగులు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సర్వే నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రికార్డు స్థాయిలో కోటి 9 లక్షల కుటుంబాల వివరాలు సేకరించినట్టు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల పేర్లు, వయస్సు, విద్యార్హతలు, వృత్తి, ఆధార్ కార్డు వివరాలు, బ్యాంక్ ఖాతాలు, ఆస్తిపాస్తులు, తదితర వివరాలన్నింటినీ సర్వే బృందం సేకరించిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడానికి సమగ్ర సర్వే దోహదపడిందని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కొనియాడింది.