తెలంగాణ

కాంగ్రెస్ బలోపేతానికి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 27: రాష్ట్రంలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేస్తూ, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆ పార్టీ అధిష్టానం సమాయత్తం చేస్తున్నది. ఇందులో భాగంగానే శనివారం సాయంత్రం గాంధీ భవన్‌లో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఎఐసిసి నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పోలింగ్ కేంద్రం వరకూ పార్టీని తీసుకెళ్ళేందుకు, అందుకు కార్యకర్తలను సిద్ధం చేసేందుకు పార్టీ అధిష్టానం ‘శక్తి ఆప్’ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో శక్తి ఆప్ ఏ మేరకు పని చేస్తున్నదనే విషయాన్ని చిదంబరం ఈ సమీక్షా సమావేశంలో పరిశీలించి, ఇంకా అవసరమైన సలహాలు, సూచనలు చేయనున్నారు. రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తున్నది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీగా ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ఆర్‌సి కుంతియా ఉన్నప్పటికీ, అదనంగా మరో ముగ్గురు ఎఐసిసి కార్యదర్శులను ఇన్‌ఛార్జీలుగా నియమించింది. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఈ ముగ్గురికీ అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురూ తమకు కేటాయించిన లోక్‌సభ నియోజకవర్గాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పర్యటిస్తూ, సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకులంతా ఈ సమావేశంలో పాల్గొంటారు.