తెలంగాణ

విద్యార్థులపై వేధింపుల విచారణకు కమిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 27: విద్యార్ధులపై జరుగుతున్న వేధింపుల విచారణకు ఒక కమిషన్‌ను నియమించాలని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (టీపీఏ), బాలల హక్కుల సంఘం (బీహెచ్‌ఎస్), హైదరాబాద్ పాఠశాలల తల్లిదండ్రుల సంఘం (హెచ్‌ఎస్‌పీఏ) సంయుక్తంగా డిమాండ్ చేశాయి. సంఘాల నాయకులు పాత్రికేయులతో మాట్లాడుతూ విద్యార్థులపై జరుగుతున్న దౌర్జన్యాలను నిరోధించాలని అన్నారు. పాఠశాలల్లో యాజమాన్యాలు విద్యార్థులపై చేస్తున్న వేధింపుల విచారణకు ప్రత్యేక కమిషన్‌ను నియమించాలని, స్టాట్యూటరీ అయిన బాలల హక్కుల సంరక్షణ కమిషన్‌ను వెంటనే నియమించాలని, ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చట్టాన్ని తీసుకురావాలని అన్నారు. టీపీఏ అధ్యక్షుడు నాగాటి నారాయణ రౌండ్‌టేబుల్‌కు అధ్యక్షత వహించగా, బీహెచ్‌ఎస్ గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులపై జరుగుతున్న దాడులను, దౌర్జన్యాలను వివరించారు. హిమాయత్‌నగర్‌లోని ఒక స్కూల్లో ఒక విద్యార్థి గుర్రం తోక వంటి జడ వేసుకొచ్చిందని అవమానించారని , సికింద్రాబాద్‌లోని ఒక పాఠశాలలో హోం వర్కు చేయలేదని 60 మార్లు గ్రౌండ్‌లో తిప్పించారని, కొన్ని స్కూళ్లలో టీచర్లు లైంగిక దాడులకు కూడా పాల్పడుతున్నారని కవాడీగూడలోని ఒక పాఠశాలలో ఫీజు కోసం వత్తిడి చేయడంతో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని, అనేక స్కూళ్లలో విద్యార్ధులు కాలకృత్యాలకు కూడా నోచుకోవడం లేదని, మంచినీటిని తాగనీయడం లేదని, కొంత మంది ఇంటి నుండి ఆహారం తెచ్చుకుంటే దానిని తిననివ్వడం లేదని అన్నారు. అదే విధంగా చదువు పేరుతో, క్రమశిక్షణ పేరుతో అనేక రకాలుగా హింసిస్తున్నారని అన్నారు. ఈసందర్భంగా నారాయణ మాట్లాడుతూ విద్యాశాఖ అధికారులకు ఈ అంశాలపై ఎన్ని మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. యాజమాన్యాలు నియంతృత్వంతో వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.