తెలంగాణ

మెరుగుపడని వర్శిటీల పరిస్థితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 27: తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల తీరు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది. ఏళ్ల తరబడి ఎన్నిమార్లు చెప్పినా, యూనివర్శిటీలు కేవలం పరీక్షలు నిర్వహించడం, ఫలితాలు ఇవ్వడానికి పరిమితం అవుతున్నాయే తప్ప ఆధునిక సంస్కరణలను అందిపుచ్చుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావినికి ముందు నుండి యూనివర్శిటీలు ఎలా పనిచేయాలనేదానిపై రాష్ట్ర గవర్నర్, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఎన్ని మార్లు ఎన్ని సూచనలు చేసినా, వర్శిటీలు మాత్రం తమదైన శైలిలోనే పనిచేస్తున్నాయి. ఉన్న వాటిలో ఉస్మానియా, జెఎన్‌టియుల పరిస్థితి కాస్తా మెరుగ్గా ఉన్నా, మిగిలిన విశ్వవిద్యాలయాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పరీక్షలు నిర్వహించి కొన్ని సబ్జెక్టుల్లో వాల్యూయేషన్ కాకుండానే ఫలితాలను ప్రకటిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నింటిలో రిజిస్ట్రార్ ఇన్‌చార్జి, డీన్ ఇన్‌చార్జి, డిపార్టుమెంట్ హెడ్‌గా ఒక్కరే వ్యవహరిస్తుండగా, రెండు నెలలకు, మూడు నెలలకో మారు మాత్రమే వర్శిటీలకు వచ్చే ఇన్‌ఛార్జివీసీలు కొనసాగుతున్నారు. పార్టుటైమ్ లెక్చరర్లే హెడ్‌గా, డీన్‌గా, బోర్డ్ఫా స్టడీస్ చైర్మన్లుగా కొనసాగుతున్నారు. పార్టుటైమ్ లెక్చరర్లే బోర్డ్ఫా స్టడీస్ చైర్మన్లు అయినపుడు వారు రూపొందించే ప్యానల్స్‌లో ఎంత వరకూ గోప్యత ఉంటుందో ఎవరికీ అర్ధంకాని పరిస్థితి, కొన్ని యూనివర్శిటీల్లో కంట్రోలర్‌లుగా తాత్కాలిక ఉద్యోగులో, పునర్నియమితులైన వారో ఉంటున్నారు. ఈ దురవస్థను తొలగించి, రాష్ట్రంలో ఉన్నత విద్యకు ఒక స్వరూపం ఇవ్వాలని, యూనివర్శిటీలు చైతన్యవంతంగా రుపుదిద్దుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ యూనివర్శిటీల వీసీలకు ఉద్బోధించారు. వీసీలతో పలు సందర్భాల్లో మాట్లాడినపుడు స్నాతకోత్సవ సభలకు వెళ్లినపుడు గవర్నర్ తన మనసులో మాట చెబుతునే ఉన్నారు. ఎప్పటికీ వీసీల తీరు మారకపోవడంతో గత ఏడాది అక్టోబర్ 6న నిర్వహించిన వీసీల సదస్సులో కొన్ని సూచనలు చేశారు. ప్రధానంగా అన్ని విశ్వవిద్యాలయాలు ఏకరూప వార్షిక ప్రణాళికలను పాటించాలని, అన్ని విద్యాసంస్థల్లో బయోమెట్రిక్ నెలకోల్పాలని , అలాగే విద్యాసంస్థల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ర్యాగింగ్ వంటి చర్యలకు సీనియర్లు పాల్పడకుండా సీసీ కెమరాలు నెలకోల్పాలని గవర్నర్ పేర్కొన్నారు. అన్ని యూనివర్శిటీల్లో కనీస వౌలిక సదుపాయాలు కల్పించాలని, కేటాయించిన నిధులను సంపూర్ణంగా వినియోగించుకోవాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, అందుకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని కూడా చెప్పారు. ప్రధానంగా ఖాళీలను గుర్తించడం, రోస్టర్ రూపొందించడం, నోటిఫికేషన్ జారీ చేసి, రిక్రూట్‌మెంట్‌కు లిఖిత పరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహించడం పూర్తి చేయాలని చెప్పారు. విశ్వవిద్యాలయాల్లో అన్ని పనులనూ డిజిటల్ చేయాలని, అడ్మిషన్లు, కౌనె్సలింగ్, సర్ట్ఫికేట్ల పరిశీలన, ఫీజుల చెల్లింపు, పరీక్ష పత్రాలను పంపించడం, మూల్యాంకనం, సిబ్బంది వ్యవహారాలను కూడా డిజిటల్ చేయాలని గవర్నర్ పేర్కొన్నారు. చదువు పూర్తి చేసిన విద్యార్థులకు అవసరమైన ఉద్యోగ అవకాశాలు కల్పించడం, కన్సల్టెన్సీ చేపట్టడం ద్వారా యూనివర్శిటీలు తమ అవసరాలకు అంతర్గతంగానే నిధులను సమీకరించుకుని ప్రభుత్వంపై ఆధారపడటం తగ్గించుకోవాలని గవర్నర్ పేర్కొన్నారు. ప్రమాణాలు పెంచుకుని విదేశీ విద్యార్థులను ఆకర్షించి, మరో పక్క ప్రభుత్వ అసరాలకు కనె్సల్టెన్సీ సేవలను అందించాలని సూచించారు. వినూత్న పరిశోధన ప్రాజెక్టులను చేపట్టడం, ఫ్యాకల్టీ శిక్షణ, అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీలను నిరంతరం తనిఖీలు చేయడం, వాటి విద్యావ్యవహారాలపై ఒకకనే్నసి ఉంచడం, యూనివర్శిటీ హాస్టళ్లలో బయటి వ్యక్తులు బస చేయకుండా నిరోధించడం, అకడమిక్ కౌన్సిళ్లను నియమించడం చాలా ముఖ్యమని గవర్నర్ పేర్కొన్నారు. కొన్ని సేవలను ఆన్‌లైన్ చేయడం వినా మిగిలిన ఏ పనులనూ యూనివర్శిటీలు చేపట్టలేకపోయాయి.
10 నెలల విరామం తర్వాత గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ వైస్ ఛాన్సలర్ల పనితీరును సమీక్షించనున్నారు. ఆగస్టు 8వ తేదీన వీసీల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతి విశ్వవిద్యాలయం గత కొద్ది నెలల్లో, గత కొద్ది సంవత్సరాల్లో సాధించిన ప్రగతిని వివరించాల్సి ఉంటుంది. ఈ భేటీని విజయవంతం చేసేందుకు ఆగస్టు 4న కొంతమంది వీసీలతో సన్నాహక సమావేశాన్ని ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేస్తోందని కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి, ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ వి వెంకటరమణ చెప్పారు. కాగా మరో పక్క ఈ నెల 30న యూనివర్శిటీల్లో సీబీసీఎస్ విధానం అమలుపై సమీక్ష నిర్వహిస్తామని ప్రొఫెసర్ వెంకటరమణ పేర్కొన్నారు.