తెలంగాణ

జిల్లాకో ప్యాలీయేటివ్ కేర్ సెంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, జూలై 27: దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి నాణ్యమైన, గౌరవప్రదమైన జీవితాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా జిల్లాకు ఒకటి ప్యాలీయేటివ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వాకాటి కరుణ పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ప్రభుత్వ ఆసపత్రిని శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. ఈసందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రిలో పర్యటించి రోగులు, గర్భిణులతో మాట్లాడి సమస్యలపై ఆరాతీశారు. అనంతరం విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో జిల్లాకు ఒకటి వంతున 30 ప్యాలీయేటివ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. మొదటి దశలో తొమ్మిది ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే మూడింటిని ప్రారంభించుకున్నామన్నారు. చౌటుప్పల్‌లో నాల్గో కేంద్రాన్ని ప్రారంభించుకున్నామని వివరించారు. ప్యాలీయేటివ్ కేర్ సెంటర్ నిర్వహణ బాధ్యతలను టాటా ట్రస్ట్‌కు అప్పగించామని వివరించారు. అలాగే రాష్టవ్య్రా ప్తంగా 911 వైద్య పోస్టులను భర్తీ చేశామన్నారు. అందు లో భాగంగా చౌటుప్పల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు 13 మందిని నియామకం చేయగా ఆరుగురు జాయిన్ అయ్యారన్నారు. మరో ఏడుగురు త్వరలో చేరుతారని చెప్పారు. వైద్యుల భర్తీ పూర్తి కావడంతో చౌటుప్పల్, ఆలేరు, రామన్నపేటలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 24 గంటలు వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. పేద ప్రజలు ప్రైవేటును ఆశ్రయించి ఆర్థికంగా భారం పడకుండా ఉండేందుకు వైద్యులు ఎప్పటికప్పుడు స్పందించాలన్నారు. గ్రామీణ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించామన్నారు. ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకాన్ని పెంచాలని సూచించారు. కేసీఆర్ కిట్లతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయన్నారు. సాధారణ ప్రసవాలకే అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. 70శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయని, వాటిని 90 శాతం పెంచేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో సాంబశివుడు, డీసీహెచ్‌వో కోట్యానాయ క్, డిప్యూటీ డీఎంహెచ్‌వో మనోహర్, వీరన్న ఉన్నారు.

చిత్రం..చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులతో మాట్లాడుతున్న కమిషనర్ వాకాటి కరుణ