ఆంధ్రప్రదేశ్‌

చక్కెర కర్మాగారంలో ఘోర ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేగిడి, మే 27: శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం సంకిలి ప్యారీ చక్కెర కర్మాగారంలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. కర్మాగారంలోని బాయిలర్‌ను శుభ్రం చేయడానికి లోపలకు దిగిన ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ఈ విషయం మిగిలిన కార్మికులకు తెలియడంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతులంతా రేగిడి మండలం లక్ష్మీపేట గ్రామానికి చెందిన వారు. ఇటీవల కర్మాగారం క్రషింగ్ పూర్తి కావడంతో కార్మికులు క్లీనింగ్ పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో బాయిలర్‌లో దిగి శుభ్రం చేస్తుండగా విషవాయువులు వెలువడటంతో లక్ష్మీపేట గ్రామానికి చెందిన కార్మికులు యెర్ని సోంబాబు(30), అబోతుల తవిటినాయుడు(37), కెంబూరు చంద్రరావు(36) అక్కడికక్కడే మృతి చెందారు. మరో కార్మికుడు కెంబూరు నారాయణరావు తీవ్ర గాయాలపాలయ్యాడు. మృతి చెందిన వారిని కర్మాగార యాజమాన్యం బాయిలర్ నుంచి వెలికి తీసి గాయపడిన నారాయణరావును రాజాం కేర్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పాలకొండ ఏరియా ఆసుపత్రికి పిఎం నిమిత్తం తరలించారు. ప్రమాదం సంభవించిన వెంటనే తోటి కార్మికుల సమాచారం మేరకు మృతుల తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు కర్మాగారం వద్ద ఆందోళనకు దిగారు. యాజమాన్యం క్లీనింగ్ సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేయకపోవడంపై గ్రామస్తులు తీవ్ర వాగ్వివాదానికి దిగారు. పాలకొండ డిఎస్పీ ఆదినారాయణ, సిఐ వేణుగోపాలనాయుడు, పాలకొండ, రాజాం, రేగిడి, సంతకవిటి ఎస్సైలు, సిబ్బంది కర్మాగార ప్రాంతానికి చేరుకుని ఆందోళన చేస్తున్న గ్రామస్తులను వారించే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
పేలిన మందుపాతర..తప్పిన ముప్పు
చింతూరు, మే 27: తూర్పు గోదావరి చింతూరు మండలం ఏడు గుర్రాలపల్లి గ్రామ సమీపంలోని రేగులపాడు గుంపులో మావోయిస్టులు అమర్చిన ఐఇడి బాంబు శుక్రవారం తెల్లవారుజామున పేలింది. కాగా ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రాణహానీ జరగలేదు. ఎస్‌ఐ గజేంద్రకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రేగులపాడు గుంపులో మావోయిస్టులు పోలీసు బలగాలు లక్ష్యంగా అమర్చిన ఐఇడి బాంబు శుక్రవారం తెల్లవారుజామున పేలింది. విషయం తెలుసుకున్న డిఎస్పీ మురళీమోహన్, సిఐ దుర్గారావు, ఎస్‌ఐ గజేంద్రకుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని నిశితంగా పరిశీంచారు. గ్రామస్థులతో సమావేశమై పేలుడు ఘటనపై ఆరాతీశారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని పోలీస్ అధికారులు స్పష్టంచేశారు. ఈ నెల 13, 20 తేదీల్లో ఇదే రేగులపాడు గుంపులో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను పోలీసులు గుర్తించి, వాటిని నిర్వీర్యంచేశారు. మరలా శుక్రవారం బాంబు పేలడంతో ఆ గ్రామంలో అలజడి నెలకొంది. మావోయిస్టులు వరుసగా మందుపాతరలు అమర్చడంతో ఏ సమయంలో ఎటువంటి సంఘటన చోటు చేసుకుంటుందోనని గ్రామస్థులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
లిఫ్ట్‌లో ఇరుక్కున్న అల్లు అర్జున్
సింహాచలం, మే 27: ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ శుక్రవారం శ్రీ వరాహ లక్ష్మినృసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఈయనతోపాటు దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ఉన్నారు. అయితే అల్లు అర్జున్‌ను చూసిన అభిమానులు ఒక్కసారిగా క్యూలైన్ల నుంచి తోసుకురావడంతో అల్లు అర్జున్ ఆశీర్వాదం స్వీకరించకుండానే వెళ్లిపోవాల్సి వచ్చింది. అర్జున్‌తోపాటు, మీడియా, అభిమానులు లిఫ్ట్‌లో చొరబడటంతో లిఫ్టు కిందకి దిగాక తలుపులు తెరచుకోపోవడంతో లిఫ్ట్‌లో ఉన్నవారంతా కొద్దిసేపు ఆందోళన చెందారు. ఎస్‌పిఎఫ్, సెక్యూరిటీ సిబ్బంది వచ్చి లిఫ్ట్ తలుపులు పగులగొట్టి తెరిచారు. దీంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉండగా లిఫ్ట్ మరమ్మతులకు అయ్యే ఖర్చు తామే భరిస్తామని అల్లు అర్జున్ మేనేజర్ సత్యనారాయణ హామీ ఇచ్చారు.

గెడ్డలో మునిగి
ముగ్గురు మృతి
డుంబ్రిగుడ, మే 27: సరదాగా గెడ్డలో స్నానానికి దిగిన ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. విశాఖపట్నం జిల్లాలోని డుంబ్రిగుడ మండల కేంద్రంలో హుకుంపేట మండలం బాకూరు గ్రామానికి చెందిన రాజబాబు, డుంబ్రిగుడ మండలం దండగుడ గ్రామానికి చెందిన శోభా నిరంజన్, పోతంగి పంచాయతీ చంపపట్టి గ్రామానికి చెందిన తాంగుల సహదేవ్ అనే ముగ్గురు ఉపాధ్యాయులు ఉంటున్నారు. శుక్రవారం ఉదయం పది గంటలకు రాజబాబు కుమారుడు డి.సిద్ధార్థ(8), నిరంజన్ కుమార్తె ఎస్.హరిత(9), సహదేవ్ కుమార్తె టి.్భవన(8) గ్రామానికి సమీపంలో గల మామిడి చెట్ల వద్దకు పండ్ల నిమిత్తం వెళ్లారు. అక్కడ మామిడి పండ్లు తిన్న తర్వాత తిరిగి ఇంటికి వచ్చే సమయంలో బాలికల పాఠశాలకు సమీపంలో ఉన్న పారేగెడ్డలో స్నానానికి దిగారు. స్నానం చేస్తూ ముగ్గురు ఒక్కసారిగా మునిగిపోయారు. గెడ్డ పక్కనే బట్టలు ఉతుకుతున్న మహిళలు గమనించి కేకలు వేస్తూ సంఘటనను గ్రామస్థులకు సమాచారం అందించారు. స్థానికులు హుటాహుటిన చేరుకొని చిన్నారులను బయటకు తీశారు.