తెలంగాణ

రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, ఆగస్టు 6: రాష్ట్రంలో వ్యవసాయం దండుగ కాదు పండుగ అని నిరూపించి రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచామని రాష్ట్ర విద్యుత్, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లాలోని వివిధ మండలల్లో సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఖిల్లాఘనపురం మండలం ఉప్పరిపల్లిలో కోటి 25లక్షలతో నిర్మించిన 33/11కెవి సబ్‌స్టేషన్‌ను, పెద్దమందడి మండలం దొడగుంటపల్లిలో కోటి 50లక్షలతో నిర్మించిన సబ్‌స్టేషన్ భవనాన్ని, గోపాల్‌పేట మండలం చాకలిపల్లి గ్రామంలో కోటి 60లక్షల వ్యయంతో నిర్మించనున్న 33/11కెవి సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. అలాగే రైతు జీవిత బీమా పథకం కింద రైతులకు బీమా ధ్రువపత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రైతే తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం అదృష్టమని, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత రైతులకు సాగునీరు, ఉచిత 24గంటల విద్యుత్తు, వ్యవసాయ సాగుకు అవసరమయ్యే పెట్టుబడి సాయాన్ని అందించడం, గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆగస్టు 14 అర్ధరాత్రి నుండి రైతుబీమా పథకం కింద ఏ కారణం చేతనైనా రైతు చనిపోతే రూ.5లక్షల బీమాను చెల్లించేలా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. నీళ్ళు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని పెంచగలిగామన్నారు. కేసీఆర్ కిట్టు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ప్రసవంతో పాటు రూ. 12వేలను, 16 రకాల వస్తువులను అందజేస్తున్నామని, హస్టల్ విద్యార్థులకు సన్న బియ్యం అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల వల్ల బడుగు, బలహిన వర్గాల్లో ఆనందాన్ని చూస్తున్నామన్నారు. సమాజంలో అన్ని కులాలు ,వర్గాలను అభివృద్ది చేసేందుకు గాను గొల్ల కుర్మలకు గొర్రెలను, మత్స్యకారులకు చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో రైతు ఎలాంటి అప్పు చేయకుండానే వ్యవసాయం చేయాలన్నది ముఖ్యమంత్రి ఉద్దేశమని అందుకే ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 25లక్షల బోరు మోటార్ల ద్వారా వ్యవసాయం సాగు జరుగుతున్నదని, వీటితో కలిపి రైతులందరికీ 24గంటల ఉచిత విద్యుత్ అందజేస్తున్నామన్నారు. రైతు పండించిన పంటకు రైతే ధర నిర్ణయించాలని ఉద్దేశంతో రైతు సమన్వయ సమితిలను ఏర్పాటుచేసి అందులో రైతులను భాగస్వాములను చేయడం జరిగిందన్నారు. అంతకు ముందు ఆచార్య జయశంకర్ జయంతి సందర్బంగా జయశంకర్ చిత్రపటానికి మంత్రి జగదీష్‌రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్‌రెడ్డి పూలమాల వేసి నివాళలర్పించారు. ప్రణాళికా సంఘం ఉపాద్యక్షులు నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ఆచార్య జయశంకర్ కలలు గన్న బంగారు తెలంగాణను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీ ఆర్ పని చేస్తున్నారన్నారు. ఉచిత విద్యుత్తు, సాగునీటి ప్రాజెక్టులు, పెట్టుబడి సాయం, చేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదని ఆయన అన్నారు.
చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి