తెలంగాణ

జయశంకర్‌కు ఘన నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ వాదాన్ని ప్రపంచానికి చాటిన మహాజ్ఞాని ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు సోమవారం రాష్టవ్య్రాప్తంగా ఘనంగా జరిగాయి. తెలంగాణ వాధాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. టీఆర్‌ఎస్ భవన్‌లో జరిగిన వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోన్ పాల్గొని ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళ్ళర్పించారు. ఆదిలాబాద్‌లో మంత్రి జోగు రామన్న జయశంకర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళ్ళర్పించారు. గన్‌పార్క్ వద్ద నిర్వహించిన వేడుకల్లో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్, కాంగ్రెస్ నేత హనుమంత రావు పాల్గొని నివాళ్ళర్పించారు. తన తుదిశ్వాస వరకు తెలంగాణ ఏర్పాటుకు కృషి చేసిన ఆచార్య జయశంకర్ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జయశంకర్ వేడుకలను నిర్వహించారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు జయ శంకర్ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళ్ళర్పించారు.

చిత్రాలు..తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకల్లో మంత్రులు మహమూద్ అలీ, నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ * అమరవీరుల స్థూపం వద్ద హనుమంతరావు, ప్రొఫెసర్ కోదండరామ్ నివాళులు