ఆంధ్రప్రదేశ్‌

ఆత్మస్తుతి..పరనింద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 27: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు మహానాడులో పార్టీ వైఫల్యాల గురించి ప్రస్తావించకుండా వైకాపా అధ్యక్షుడు జగన్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడడం తగదని వైకాపా సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఇక్కడ లోటస్‌పాండ్‌లో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిడిపి తిరుపతిలో నిర్వహిస్తున్న మహానాడులో చంద్రబాబు ఆత్మస్తుతి, పరనిందకు పరిమితమయ్యారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేకపోయామన్న అంశంపై ఆత్మవిమర్శ చేసుకోలేదన్నారు. రైతులకు రుణమాఫీ మొదలుకుని రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై పార్టీ వైఖరిని వెల్లడించలేదన్నారు. మహానాడు సమావేశాల్లో ఇతర పార్టీలపై అనుచిత విమర్శలు మానుకోవాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పి, ఇప్పుడు వెనకడుగు వేయడం ఎందుకన్నారు. గతంలో ఎనిమిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ప్రత్యేక హోదా వల్ల లాభం లేదనుకుంటే, ఎన్నికలకు ముందే ప్యాకేజీ అడుగుదామని ఎందుకు ప్రకటించలేదన్నారు. వైకాపా ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి టిడిపిలో చేర్చుకోవడంపై బాబు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. టిడిపి ఎమ్మెల్యే పరిటాల రవీంద్ర మృతికి ప్రతిపక్ష నేత జగన్ కారణమని ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయడం తగదన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించే అక్రమ ప్రాజెక్టులపై నోరు ఎందుకు మెదపడం లేదన్నారు. శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగులు ఉంటేనే పోతిరెడ్డిపాడుకు నీళ్లు వస్తాయన్నారు. ఈ విషయంపై చంద్రబాబు మాట్లాడకుండా దాటవేత వైఖరిని అవలంబించడం ఎందుకన్నారు. వెనకబడిన జిల్లాలకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకురాలేదని, విశాఖపట్నంకు రైల్వే జోన్‌ను మంజూరు చేయించలేకపోయారన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయనా సందర్భంగా తన వైఫల్యాలను చెప్పకుండా, ఆత్మపరిశీలన చేసుకుని రాష్ట్భ్రావృద్ధికి అవసరమయ్యే నిర్ణయాలు తీసుకోకుండా బాబు తన గోతులు తానే తవ్వుకుంటున్నారన్నారు.
నేటి నుండి ఏపి
ఇంజనీరింగ్ అడ్మిషన్లు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 27: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ శనివారం నుండి ప్రారంభం కానుంది. అభ్యర్థుల సర్ట్ఫికేట్ల పరిశీలన జూన్ 6వ తేదీన మొదలవుతుంది. సర్ట్ఫికేట్ల వెరిఫికేషన్ పూర్తి చేసిన వారు జూన్ 9 నుండి వెబ్ ఆప్షన్లను ఇవ్వాల్సి ఉంటుంది. చివరగా మరోమారు అందరికీ వెబ్ ఆప్షన్లలో చేర్పులు, మార్పులకు 19న మరో అవకాశం కల్పిస్తారు. 22న సీట్ల కేటాయింపు జరుగుతుంది. జూన్ 27 నుండి క్లాసులు మొదలవుతాయి. తద్వారా తెలంగాణ అడ్మిషన్లకన్నా ముందుగానే ఆంధ్రా అడ్మిషన్లు పూర్తికావడం వల్ల హైదరాబాద్‌లో అడ్మిషన్లపై విద్యార్థులకు చాలా స్పష్టత రానుంది.

బదిలీ అయిన ఏడాది తర్వాత టీచర్ల రిలీవ్

హైదరాబాద్, మే 27: ఆంధ్రప్రదేశ్‌లో బదిలీ అయిన టీచర్లకు ఏడాది తర్వాత రిలీవ్ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు కె సంధ్యారాణి ఉత్తర్వులు జారీ చేశారు. 2015 బదిలీల కౌనె్సలింగ్‌లో బదిలీ అయినా సబ్‌స్టిట్యూట్ లేక రిలీవ్ కాని వారందరినీ వెంటనే రిలీవ్ చేయాలని డైరెక్టర్ పేర్కోన్నారు. 2015లొ బదిలీ అయి సబ్‌స్టిట్యూట్ లేక రిలీవ్ కాని వారి స్థానాలు 2014 డిఎస్సీలో అభ్యర్ధులకు ప్రదర్శించడంతో ఆ ఖాళీలు అన్నీ భర్తీ అయ్యాయి. తాజాగా సవరణ ఉత్తర్వులను సంచాలకురాలు జారీ చేశారు. ఏప్రిల్ 20న ఇచ్చిన ప్రొసీడింగ్స్‌లో బదిలీ కోరుకున్న చోట అవసరం ఉంటే రిలీవ్ కావాలని , కోరుకున్న చోట అవసరం లేకపోతే రిలీవ్ కావల్సిన అవసరం లేదని, ఎనిమిదేళ్లు నిండని వారు బదిలీ కోరుకున్న చోట అవసరం ఉన్నా ఇష్టం లేకపోతే రిలీవ్ కావల్సిన అవసరం లేదని వీరు తమ బదిలీలను రద్దుచేసుకుని తదుపరి కౌనె్సలింగ్‌కు హాజరుకావాలని కూడా డైరెక్టర్ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారని యుటిఎఫ్ అధ్యక్షుడు ఐ వెంకటేశ్వరరావు, కార్యదర్శి పి బాబురెడ్డిలు చెప్పారు.

నీట్-2 నోటిఫికేషన్ జారీ
జూన్ 21 వరకూ దరఖాస్తు గడువు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 27: మెడికల్, డెంటల్ కాలేజీల్లో జాతీయ కోటా భర్తీకి నీట్ -2 నోటిఫికేషన్‌ను ఆల్ ఇండియా ప్రీ మెడికల్ అండ్ ప్రీ డెంటల్ టెస్టు (ఎఐపిఎంటి) బోర్డు విడుదల చేసింది. జూన్ 21 వరకూ ఆన్‌లైన్‌లోనూ, 25వ తేదీ వరకూ ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు వీలు కల్పించింది. పరీక్ష అడ్మిట్ కార్డులను జూలై 8వ తేదీ నుండి జారీ చేయనుంది. నీట్-2ను జూలై 24న నిర్వహిస్తారు. ఇందుకోసం జనరల్ అభ్యర్ధులు 1400 రూపాయిలు, ఎస్సీ/ఎస్టీలు 750 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ఆంధ్రాలో విజయవాడ, విశాఖపట్టణం, తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒఎంఆర్ జవాబు పత్రాల షీట్లను ఆగస్టు 4వ తేదీన నెట్‌లో ఉంచుతారు. జవాబుల తుది కీని ఆగస్టు 7న ప్రకటిస్తారు. జూలై 24న జరిగే పరీక్షకు అభ్యర్ధులు ఉదయం 7.30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవల్సి ఉంటుంది. ఆగస్టు రెండో వారంలో అడ్మిషన్లకు కౌనె్సలింగ్ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 1 నుండి తరగతులను ప్రారంభిస్తారు.

పార్టీ సభ్యత్వం తీసుకున్న చంద్రబాబు

తిరుపతి, మే 27: తెలుగుదేశం పార్టీ మహానాడు సంబరాలు శుక్రవారం తిరుపతిలో అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. టిడిపి ఆవిర్భవించి 34 సంవత్సరాలు పూర్తిచేసుకుని 35వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా స్థానిక నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ క్రీడామైదానంలో మూడు రోజులపాటు జరిగే మహానాడు సభలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 10 గంటలకు చేరుకున్నారు. ముందుగా పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్న చంద్రబాబు నాయుడు అక్కడ నుంచి ప్రాంగణంలో ఎన్‌టిఆర్ రక్తదాన శిబిరాన్ని, త్రిడి షోను, ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. అనంతరం వేదిక వద్దకు చేరుకుని పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ వ్యవస్థాపకులు ఎన్ టి రామారావు విగ్రహానికి పూల మాలలు వేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి మహానాడు సమావేశాలను ప్రారంభించారు.
ఎమ్మెల్యే బాలకృష్ణ, ఏపి, తెలంగాణ రాష్ట్రాల టిడిపి అధ్యక్షులు కళావెంకట్రావు, రమణ, మంత్రి యనమల రామకృష్ణుడు, రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి పలువురు మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎన్‌టిఆర్ అమర్హ్రే, చంద్రబాబు నాయకత్వం వర్థిల్లాలంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో సభాప్రాంగణం హోరెత్తింది.