తెలంగాణ

కేసీఆర్ పాలనను ప్రధానే ప్రశంసించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: ‘సీఎం కేసీఆర్ పరిణితి చెందిన నాయకుడని సాక్ష్యాత్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనే ప్రశంసించారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా పరిపాలనా సాగుతోంది’ అని ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. నాలుగేండ్లలో సాధించిన అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు ప్రగతి నివేదన సభ ఏర్పాటు చేసామన్నారు. జలవిహార్‌లో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్పొరేటర్లతో ప్రగతి నివేదన సభకు జన సమీకరణ అంశంపై కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ప్రతిపక్షాలు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రతిపక్షాలు ఉపయోగిస్తున్న భాష చూస్తుంటే బాధేస్తోందన్నారు. కుటుంబ పాలన గురించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రాహుల్ గాంధీ కుటుంబ పాలన గురించి మాట్లడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని విమర్శించారు. రాహుల్ పేరు వెనుక గాంధీ అనే మాట లేకుంటే ఆయన కార్పొరేటర్‌గా కూడా గెలిచేవాడుకదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే ఒకాయన గడ్డం తీయనంటాడు, మరొకతను మెడ కోసుకుంట అంటాడు, ఇంకోయన అయితే జీహెచ్‌ఎంసి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వంద సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని అన్నాడని కేటీఆర్ గుర్తు చేసారు. హైదరాబాద్ నగరంలో ఉన్నవారంతా మనవాళ్లే అనుకున్నాం, హైదరాబాద్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒక్క మత కల్లోలం జరుగలేదు, కర్ఫూ విధించలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడేనాడు మీకు పరిపాలన వస్తుందా? అన్నారని గుర్తుచేసారు. కాంగ్రెస్ నాయకులు కళ్లు తిరిగి అడ్డం పడేలా పాలన సాగించామన్నారు.
ఎక్కడ ఎన్నికలు జరిగినా గెలుపు టీఆర్‌ఎస్‌దేనని నిరూపించామన్నారు. ప్రగతి నివేదన సభను విజయవంతం చేయడానికి హైదరాబాద్ నగర నాయకులు ప్రతిష్టాకరంగా తీసుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.