తెలంగాణ

వాజ్‌పేయి చితాభస్మంతో రాజకీయాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: మాజీ ప్రధాని వాజ్‌పేయి చితాభస్మంతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజకీయాలు చేస్తూ ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్‌కుమార్ అంజన్ ధ్వజమెత్తారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో రెండు రోజుల పాటు జరగనున్న కౌన్సిల్ సమావేశాలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ఆగస్టు 14న అటల్ మరణించినా ఎర్రకోట నుంచి ప్రసంగం చేసే అవకాశం చేజారుతుందనే భయంతోనే వాజపేయి మృతి వార్తను దాచి పెట్టారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. బీజేపీ దేశంలో అరాచక పాలన సాగిస్తు, మైనారిటీ, ఇతర వర్గాలపై దాడులకు తెగబడుతుందని అన్నారు. ఓ వైపు బేటీ బచావో, బేటీ పడావో అని దేశవ్యాప్తంగా నినాదాలు చేస్తూన్న బీజేపీ, అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం మహిళలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టలేక పోతోందని అన్నారు.
ముందస్తు ఎందుకో స్పష్టం చేయాలి....
అన్ని సవ్యంగా ఉన్నప్పుడు ముందస్తుకు ఎందుకు వెళుతున్నారో ప్రజలకు చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. పూర్తి సంఖ్య బలం ఉండి కొనసాగుతున్న ప్రభుత్వం అర్ధాంతరంగా పడేయాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు. ప్రజల్లో మరింత వ్యతిరేకత రాక ముందే ఎన్నికలు జరిపి రాజకీయంగా లబ్ధిపొందాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో ముందస్తుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఏ ఒక్క హామీని నెరవేర్చని టీఆర్‌ఎస్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఓడిపోవడం ఖాయమని అన్నారు.
చిత్రం..హైదరాబాద్‌లో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతున్న
సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్‌కుమార్ అంజన్