తెలంగాణ

నేడు వరంగల్‌లో బీసీ ఉద్యోగుల సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: వెనుకబడన వర్గాల ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం వరంగల్ కాకతీయ వర్సిటీ ఆడిటోరింలో మహాసభను ఏర్పాటు చేస్తున్నట్లు బిసి సంఘం వెల్లడించింది. ఈ మేరకు బిసి జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ విద్య, ఉద్యోగాలపై ఉన్న క్రిమీలేయర్‌ను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావడానికే తెలంగాణ జిల్లాల నుంచి 5వేల మందితో భారీగా బిసి వర్గాలను తరలిస్తున్నామని చెప్పారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు వర్సిటీ ఆడిటోరియంలో సభా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. బిసిలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతోందని, జనాభా ప్రాతిపధికంగా బిసిలకు విద్యా, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో వాటా లభించే వరకు పోరాటం చేస్తామన్నారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి చట్టం మాదిరిగా బిసిల కూడా అట్రాసిటి చట్టం తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. సభలో 12 అంశాలకు సంబంధించిన విషయాలపై ప్రధానంగా చర్చిస్తామన్నారు. సభకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మదుసూదనచారి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, బిసి శాఖ మంత్రి జోగు రామన్న, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజి శ్రావణ్, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు.