తెలంగాణ

నెల రోజుల్లో పూర్తిచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: హైదరాబాద్ మెట్రో డవలప్‌మెంట్ అథారటి పరిధిలోని అర్బన్ ఫారెస్టుల టెండర్ల ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో హెచ్‌ఎండీఏ పరిధిలోని అటవీ పార్కుల అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, టూరిజం శాఖ కార్యదర్శి బీ.వెంకటేశం, హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, మెట్రోరైల్ ఎండీ ఎన్‌వీఎస్‌రెడ్డి, పీసీసీఎఫ్ పీకే.ఝా, సీఎంఓ ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాసరి హరిచందన పాల్గొన్నారు. హెచ్ ఎండీఏ పరిధిలోని ఏడు జిల్లాల్లో విస్తరించి ఉన్న అర్బన్ ఫారెస్టు పార్కులను అభివృద్ధి చేస్తున్న వివిధ శాఖల అధికారులతో సీఎస్ సమీక్షించారు. అటవీ శాఖ ద్వారా 15, హెచ్‌ఎండీఏ ద్వారా 17, టీఎస్‌ఐఐసీ ద్వారా 11, టూరిజం ద్వారా 7, ఫారెస్ట్ కార్పొరేషన్ ద్వారా 4, జీహెచ్‌ఎంసీ ద్వారా 3, మెట్రోరైల్ ద్వారా 2 చొప్పున పార్కులను అభివృద్ధి చేస్తున్నామన్నారు.