తెలంగాణ

కాయినెక్స్ కుంభకోణం గుట్టురట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: అంతర్జాతీయ స్థాయిలో న్యాయమైన ట్రేడింగ్ వ్యాపార విభాగంలో సభ్యులుగా చేరండి, అందులో వచ్చే లాభాల్లో ఎక్కువ శాతం వాటా దక్కించుకోవచ్చునని నమ్మిస్తూ కోట్ల రూపాయలను వసూళ్ళు చేస్తున్న కాయినెక్స ట్రేడింగ్ డాట్‌కమ్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. పట్టుబడిన వ్యక్తుల నుంచి రూ కోటి 80 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.వీటికి సంబంధించిన విషయాలను శుక్రవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మీడియాకు విడుదల చేశారు. కాయినెక్స్ ట్రేడింగ్ డాట్‌కమ్ పేరుతో మల్టీలెవల్ మార్కెట్ ఏర్పాటుతో అంతర్జాతీయ వ్యాపారాన్ని సాగిస్తున్న ఘరానా మోసాన్ని పోలీసులు చేధించారు. తమ సంస్థ అమెరికా న్యూయార్క్ వద్ద వరల్డ్ ట్రేడ్ సెంటర్ వెబ్‌సైట్‌తో అక్రమ వ్యాపారాన్ని చేపట్టారు. రోజూ పెట్టబడులు పెట్టండి అందుకు ఎక్కువ శాతం వడ్డీ తీసుకోండి అంటూ ప్రచారాన్ని సాగిస్తూ కోట్ల రూపాయలను వసూళ్ళు చేవారు. దాదాపు 1200 మంది తమకు ఉన్న డబ్బులను రోజూ అందులో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. అమెరికా, లండన్ వంటి నగరాల్లో సభ్యులు ఉన్నారని సభ్యులను మోసం చేశారు. తమ సంస్థలో 12 రకాల ప్లాన్‌లు ఉన్నాయిని అందులో 134 రోజుల నుంచి 500 రోజులకు రిటర్ను బెనిఫిట్ వస్తుందని సూచించేవారు. రోజూ డాలర్‌ను బట్టీ వడ్డీ ఇస్తామని మోసగించారు. కామారెడ్డి జిల్లా దోమకొండకు చెందిన జి రమేష్ గత 25 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చారు. తొలుత రియలెస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించారు. రియల్ట్ తనకు అచ్చిరాకపోవడంతో నేరాలకు అలవాటు పడ్డారు. అక్రమంగా సంపాధించాలన్న లక్ష్యంతో ఒక వెబ్‌డిజైనర్‌కు లక్ష రూపాయలు ముట్టజెప్పి తనకు అనుకూలంగా ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాడు. వ్యాపారంలో మరో ఐదుగురిని చేర్చుకున్నాడు. తన మోసాలను గోప్యంగా నిర్వహించడానకి బోయనపల్లి వద్ద మల్లికర్జున నగర్‌లో అపార్ట్ మెంట్‌ను అద్దెకు తీసుకున్నాడు. ఇక అక్కడ నుంచి తమ అక్రమ వ్యాపారాన్ని సాగిస్తున్న నేపథ్యంలో పెట్టుబడి పెట్టిన సభ్యులు సకాలంలో డబ్బులు జమ చేయకపోవడంతో సభ్యులతో వాగ్వాదం నడవడంతో అదికాస్త సభ్యులందరికీ సమాచారం అందడంతో వారు పోలీసుల దృష్టికి తీసుకుపోయారు. దీంతో టాస్క్ఫుర్స్ పోలీసులు దాడులు చేయడంతో మోసాలు బయటపడ్డాయి. మోసపోయిన సభ్యుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నారు.