తెలంగాణ

ఎన్నికలే తప్ప సమస్యలు పట్టని సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: ముందస్తు ఎన్నికలపై తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యంపైనా, ఆస్పత్రుల నిర్వహణపైనా లేదని బీజేపీ అధికార ప్రతినిధి రావుల శ్రీ్ధర్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రగతి నివేదిన సభ పేరుతో వందల కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్న టీఆర్‌ఎస్ పార్టీ నాయకులకు దాంట్లో కనీసం 10వ వంతు ఖర్చు చేసినా ఉస్మానియా ఆస్పత్రి బాగుపడుతుందని అన్నారు. ఆ మాత్రం ఇంగితం లేకపోవడం దారుణమని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి ఉస్మానియా ఆస్పత్రితో పాటు రాష్ట్రంలోని మిగిలిన ఆస్పత్రుల్లో సౌకర్యాలను మెరుగుపరచాలని, శిథిలావస్థలో ఉన్న కట్టడాలను పటిష్టపరచాలని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ అధ్వన్నంగా ఉందని, ఆస్పత్రులకు వస్తే ప్రాణాలు కాపాడుతారనుకుంటే ఆస్పత్రుల్లో సౌకర్యాల లేమి కొత్త సమస్యలను తెచ్చి పెడుతోందని అన్నారు. నిన్న ఉస్మానియా ఆస్పత్రిలో కాలుకు ఆపరేషన్ చేయించుకుందామని వచ్చిన రోగిపై భవనం పైకప్పు ఊడిపడి ఐసీయూలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. దీనికి ఎవరు బాధ్యత వహించాలని ఆయన ప్రశ్నించారు. పదే పదే ఆస్పత్రుల్లో అసౌకర్యాలపై ఎంతగా ప్రశ్నించినా ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్టు కూడా లేదని ఆరోపించారు. ఆగస్టు నెలలోనే మూడు మార్లు పైకప్పు పెచ్చులూడిపోయాయని, ఓపీ ప్రధాన ద్వారం వద్ద పోర్టికో కూలిందని, 12 అడుగుల దోబీఘాట్ గోడ కూలిందని, అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా రోగులు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులెత్తాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించిన ముఖ్యమంత్రి వారం రోజుల్లో ఆస్పత్రిని ఖాళీ చేయిస్తానని, రెండు కొత్త టవర్లు కడతామని ప్రగల్బాలు పలికారని, ఇంత వరకూ ఇటుక కూడా పేర్చిన పాపాన పోలేదని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాలం చెల్లిన పరికరాలు ప్రతిరోజు రిపేర్లు వచ్చే జనరేటర్లతో కాలం గడుపుతున్నారని అన్నారు.