తెలంగాణ

ఆలంపూర్‌కు నేడు వాజపేయి అస్థికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి అస్థికల నిమజ్జన యాత్ర శనివారం నాడు ఆలంపూర్‌కు బయలుదేరనుంది. ఈ యాత్రకు జీ కిషన్‌రెడ్డి ఇన్‌చార్జిగా ఉంటారు. ప్రధానకార్యదర్శి టీ ఆచారి సంయోజకులుగా, బీ శాంతికుమార్, నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి , సీహెచ్ స్వామిగౌడ్‌లు సహ సంయోజకులుగా ఉంటారు. ఉదయం 7 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి అస్థికల నిమజ్జన యాత్ర ప్రారంభం అవుతుంది. కొత్తూరు, షాద్‌నగర్, బాల్‌నగర్, జడ్జర్ల, భూత్పూర్, అడ్డాకుల, కొత్తకోట, పెబ్బేరు, యెర్రవల్లి మీదుగా ఆలంపూర్ చేరుకుని అక్కడ సంగమంలో అస్థికలను నిమజ్జనం చేస్తారు. అనంతరం సాయంత్రం ఐదు గంటలకు ఆర్టీసీ కళా భవన్‌లో వాజపేయి సంస్మరణ సభ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర క్రీడా శాఖా మంత్రి విజయ్ గోయల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్, శాసనసభా పక్ష నాయకుడు జీ కిషన్‌రెడ్డి, శాసనమండలి బీజేపీ పక్ష నేత ఎన్ రామచందర్‌రావుతో పాటు వివిధ పార్టీల నాయకులు, సామాజిక సంస్థల నాయకులు పాల్గొంటారు. కాగా బీజేపీ యువమోర్చ కార్యవర్గ సమావేశం మధ్యాహ్నం 2.30కి పార్టీ కార్యాలయంలో జరుగుతుందని యువమోర్చ రాష్ట్ర అధ్యక్షుడు భరత్‌గౌడ్ చెప్పారు. యువమోర్చ జాతీయ అధ్యక్షురాలు పూనం మహాజన్, రాష్ట్ర నేతలు పాల్గొంటారని చెప్పారు.