తెలంగాణ

రామ మందిరంకోసం హిందువులంతా కదలాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ అల్వాల్: అయోద్యలో రామ మందిరం నిర్మాణానికి హిందులు అందరు ఐక్యంగా తరలి రావాలని విశ్వహిందు పరిషత్ జాతీయ అధ్యక్షులు మాజి గవర్నర్ విష్ణు సదాశివ కోజి కోరారు. శుక్రవారం కంటోనె్మంట్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి విశ్వహిందు పరిషత్ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గోని మాట్లాడారు. హిందువులలో అనఐక్య వల్లనే అడ్డంకులు వస్తున్నాయనీ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర మతాల వారు వారి కోసం ఐక్యంగా ఉంటు కావల్సిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనీ కాని దేశంలో లౌకిక వాదం పేరిట కోందరు చెస్తున్న ప్రకటనల వల్ల సమస్యలు తలెత్తుతున్నాయనీ, రామ వందిర నిర్మాణానికి దేశంలోని హిందులు అందరు సిద్దం కావాలనీ చెప్పారు. కేరళలో ప్రభుత్వం వరద బాదితులకు ప్రభుత్వం కూడ చెర లేని చోట తన విశ్వహిందు పరిషత్ కార్యకర్తలు చెరుకోని సేవలు అందిస్తున్నారనీ, దేశంలో ఎక్కడ విపత్తులు సంభవించిన తమ కార్యకర్తలు తమ వంతుగా సేవలు అందిస్తున్నారనీ వివరించారు. దేశం సనాతన దర్మాన్ని వదిలి కోత్త కోత్త పోకడలకు వెళ్లి తమ సాంప్రదాయాలను, అచారాలను మర్చిపోతున్నారనీ యువతరం వాటికి ఎంత దూరం ఉంటే అంత మంచిదనీ వివరించారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థనే హిందు దర్మంలోని గోప్పతనమనీ విశ్వహిందు పరిషత్ గౌరవ అధ్యక్షులు మాజి సుప్రీంకోర్టు న్యాయవాది అలోక్ కుమార్ చెప్పారు. కుటుంబ వ్యవస్థ విచ్చిన్నమగితే దేశం విచ్చిన్న మగుతుందనీ వివరించారు. అచారాలు వ్యవహరాలు కాపాడటమే తమ లక్ష్యంగా హిందులు పెట్టు కోవాలనీ రామ మందిరం నిర్మాణానికి సన్నదం కావాలనీ ఆయన చెప్పారు. సమావేశానికి భాగ్యనగర్ విహెచ్‌పి అధ్యక్షులు నంగనూరి చంద్రశేఖర్ జి, సమావేశానికి అధ్యక్షత వహించారు. సామావేశంలో విహెచ్‌పి కార్యదర్షి గాల్ రెడ్డితోపాటు జంట నగరాలు, తెలంగాణ జిల్లాలలోని విహెచ్‌పి ప్రముఖ్‌లు పాల్గొన్నారు.

చిత్రం..కంటోనె్మంట్‌లో జరిగిన విశ్వహిందూ పరిషత్ సమావేశంలో మాట్లాడుతున్న
వీహెచ్‌పీ జాతీయ అధ్యక్షుడు విష్ణు సదాశివ కోజి