తెలంగాణ

విభజన హామీల సాధనలో కేసీఆర్ విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలను సాధించుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ట్రస్ట్భ్‌వన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఏపీ రీ-ఆర్గనైజేషన్ బిల్లు చట్టంలో ఇరు రాష్ట్రాలకు ఎంతో ఎన్నో హామీలు గుప్పించిందని చెప్పారు. ఏపీ ప్రత్యేక హోదాతో పాటు తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, హైకోర్టు విభజన, కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టు జాతీయ హోదా ఇలా ఎన్నో హామీలు ఉన్నా ఒక్క హామీని నెరవేర్చలేక పోయారని మండిపడ్డారు. బీజేపీతో స్నేహబందం కొనసాగిస్తున్న కేసీఆర్ ప్రజలకు అవసరమైన వాటిని సాధించడం దృష్టి సారించడం లేదని, స్వర్ధప్రయోజనాల కోసం ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రాణహిత-చేవెళ్ల జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి ఉంటే రాష్ట్రం పెను భారం తప్పి ఉండేదన్నారు. రీ-డిజైన్ల పేరుతో వేల కోట్లను ప్రజా ధనాన్ని వృదా చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తవుద్ధి ఉంటే కేంద్రం మెడలు వచ్చి హామీలను సాధించుకోవాలని డిమాండ్ చేశారు.
ముందస్తు గద్దె దిగేందుకే...
ముందస్తు ఎన్నికలతో కేసీఆర్‌ను గద్దె దిగడం ఖాయమని అన్నారు. ఎంత తొందరగా ఎన్నికలు వస్తే అంత త్వరగా కేసీఆర్ ఇంటికి పంపుదామని ప్రజలు వేచి చూస్తున్నారని అన్నారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానన్న హామి నుంచి ఏ ఒక్క హామిని నెరవేర్చని టీఆర్‌ఎస్‌కు ఓటు వేసేది లేదని ఎవరికి వారు వాగ్దానాలు చేసుకుంటున్నారని చెప్పారు.