తెలంగాణ

అన్ని కులాలకూ ఆత్మగౌరవ భవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కులానికి ఆత్మగౌరవ భవనాలను నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కుల భవనాల నిర్మాణాల కోసం నగర శివార్లలోని కోకపేట, ఘట్‌కేసర్, మేడిపల్లి, మేడ్చల్ అబ్దుల్లాపూర్ మెట్, ఇంజాపూర్ ప్రాంతాల్లో స్థలాలను గుర్తించినట్టు తెలిపారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో వివిధ కులాలకు స్థలాల కేటాయించే అంశంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఈటెల రాజేందర్, జోగు రామన్న, జగదీష్‌రెడ్డి, చందూలాల్, ఇంద్రకరన్ రెడ్డి, ఎంపీ వినోద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే. జోషి, సీనియర్ అధికారులు నర్సింగ్ రావు, రామకృష్ణరావు, శివశంకర్, దాన కిషోర్, బుద్ధ ప్రకాష్, భూపాల్ రెడ్డి పాల్గొని వివిధ కులాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించారు. తెలంగాణలో బలహీన వర్గాల వారి సంఖ్య అధికంగా ఉందని, సామాజిక, విద్య, ఆర్థిక రంగాల్లో వెనుకబడిన వారి అభ్యున్నతికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అన్ని కులాల వికాసానికి ఉపయోపడే విధంగా రాష్ట్ర రాజధానిలో భవనాలను నిర్మించి ఇస్తున్నట్టు చెప్పారు. 36 సంచార కులాలకు కలిపి పది కోట్ల వ్యయంతో రూ.10 కోట్లతో ఆత్మగౌరవ భవన్ నిర్మిస్తామని వివరించారు. స్థలాలు కేటాయింపు పూర్తి అయిన కులాలకు తక్షణమే భవనాలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు.

చిత్రం..వివిధ కులాలకు భవనాల నిర్మాణం కోసం స్థలాలు కేటాయించే అంశంపై శుక్రవారం ప్రగతి భవన్‌లో మంత్రులు, అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు