తెలంగాణ

ఉద్యమకారులపై ఉక్కుపాదం సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 25: పేదల పక్షాన పోరాడుతున్న సీపీఐ (ఎంఎల్) నేతలపై అక్రమ కేసులు బనాయించి, కోర్టుల చుట్టూతిప్పుతూ ఉద్యమ కారులపై కక్ష్యసాధింపు చర్యులకు ప్రభుత్వం పాల్పడుతోందని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఉద్యమకారుల చేతులకు సంకెళ్ళు వేయడం అనాగరిక సామాజాన్ని గుర్తు చేస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మంచిర్యాల పట్టణంలో గత 20 ఏళ్ళుగా అద్దె ఇళ్లల్లో ఉంటున్నారని, వారికి స్థలాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 2013లో సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రస్తుతం ఉన్న స్థలంలో పేదలకు ఇళ్ళ పాట్టలు ఇచ్చారని ఆయన గర్తు చేశారు. 345 సర్వేలో రెవెన్యూ అధికారులు సంబంధిత భూమికి హద్దులు చూపించలేదని దీంతో 330.09 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందన్నారు. ఆక్రమణకు గురైన భూమిని పేదలకు పంచాలని ఉద్యమం చేస్తే తమ పార్టీ కార్యదర్శులపై శ్రీనివాస్,లాల్‌కుమార్, అరుణోదయ, మల్లన్నతో పాటు మరో 12 మందిపై హత్యాయత్నం కేసులు బనాయించడం ఎమిటని ఆయన ప్రశ్నించారు. తమ కేడర్‌పై పెట్టిన తప్పుడు కేసులు తక్షణం ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.