తెలంగాణ

సమగ్ర కుటుంబ సర్వేలో తేలిన బీసీల జనాభా ఎంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 25: తెలంగాణ ఆవిర్భావం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం బహుల ప్రయోజనాల కోసం సమగ్ర కుటుంబ సర్వేలో వెనుకబడిన కులాల జనగణ వాటా ఎంతో తేల్చాలని తెలంగాణ బిసి సంక్షేమ అసోషియేషన్ ప్రెసిడెంట్ ఎర్రా సత్యనారాయణ డిమాండ్ చేశారు. బిసిలకు సూచిస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు కేటాయిస్తున్న నిధులను కుదింపునకు ప్రభుత్వం వౌలిక ఆదేశాలు ఇవ్వడంపై సంఘం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈనెల 28వ తేదీన ఉదయం సోమాజీగూడలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శనివారం బిసి భవనంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అఖిలపక్ష సమావేశానికి అన్ని జాతీయ రాజకీయ పార్టీల రాష్ట్రాల అధ్యక్షులతో పాటు తెలంగాణలో ఉద్యమ పార్టీలను సైతం ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలు అమలు కానప్పటికీ కొత్త హమీలు ఇవ్వడం దేనికని ఆయన ప్రవ్నాంచారు. అన్ని కుల సంఘాలకు స్థలాలు కేటాయిస్తానని హామీ ఇచ్చారని అయితే వాస్తవంగా ఒకటి, రెండు సామాజిక కులాలకు స్థలాలు కేటాయించడం జరిగిందన్నారు. బిసి కులాలను మోసం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.