తెలంగాణ

గుండెపోటు బాధితులకు ప్రాథమిక వైద్య కిట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 25: అత్యవసర వాహన సేవల్లో మన రాష్ట్రం దేశంలోనే ముందున్నదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రసవాల నుంచి మొదలుకుని మరణానంతరం వరకూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వాహన సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నదని ఆయన చెప్పారు. రోటరీ క్లబ్, ఉస్మానియా, గాంధీ, కాకతీయ, మెడికల్ కాలేజీల పూర్వ విద్యార్థుల సంఘం సహకారంతో 175 కిట్లను ప్రభుత్వానికి అందించారు. ఆ కిట్లను 108 నెంబర్ వాహనాలకు అమర్చే కార్యక్రమాన్ని మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఇది గుండెపోటు బాధితులకు అత్యవసర ప్రాథమిక వైద్యం అందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. తెలంగాణలో 102, 104, 108 నెంబర్లతో కూడిన వాహన సేవలే కాకుండా మరణానంతరం కూడా పార్థీవ వాహనాల ద్వారా ప్రజలకు ఉచితంగా సేవలు అందిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ఆసుపత్రులకు గర్బిణీలను తీసుకుని వస్తున్నామని, ప్రసవం తర్వాత తల్లీబిడ్డలను క్షేమంగా వారి ఇళ్ళలో దించడానికి 102 నెంబర్ గల 240 వాహనాలు నిరంతరం పని చేస్తున్నాయని అన్నారు. అదేవిధంగా 108 సేవలను మరింత విస్తృతపరచనున్నట్లు ఆయన తెలిపారు. రోటరీ సంస్థ పూర్తి సేవా థృక్పదం కలదని, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఎక్కడెక్కడో స్థిరపడినప్పటికీ ప్రజలకు మేలు చేయాలన్న లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలతో ముందుకు రావడం అభినందనీయమని లక్ష్మారెడ్డి రెడ్డి అన్నారు.